JEE Main admit card 2024: జేఈఈ మెయిన్ 2024 అడ్మిన్ కార్డుల విడుదల ఎప్పుడంటే ? డౌన్లోడ్ ఇలా..
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్ష 2024 సెషన్ 1 షెడ్యూల్ ఖరారైంది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గా పేర్కొనే జేఈఈ సెషన్ 1 షెడ్యూల్ ప్రకారం పరీక్ష జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఇప్పుడు అడ్మిట్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే పరీక్షకు మూడు రోజుల ముందు అడ్మిట్ కార్డులు విడుదల చేయనున్నారు.
JEE మెయిన్ 2024 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ గతేడాది నవంబర్ 1న ప్రారంభమై నవంబర్ 30న ముగిసింది. డిసెంబర్ 8 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులకు సవరణలు చేసుకోవడానికి అనుమతించారు. అనంతరం అడ్మిట్ కార్డుల విడుదల ప్రక్రియపై అధికారులు దృష్టిసారించారు. దీంతో అభ్యర్ధులు కూడా అడ్మిట్ కార్డుల కోసం వేచి చూస్తున్నారు. అయితే జనవరి చివరి వారంలో ఈ అడ్మిట్ కార్డుల విడుదల ఉండబోతోంది. JEE (మెయిన్) 2024 13 భాషలలో నిర్వహిస్తున్నారు. ఇందులో ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ ఉన్నాయి.

అధికారికంగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం JEE మెయిన్ 2024 సెషన్ 1 అడ్మిట్ కార్డ్‌లు పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు విడుదల కానున్నాయి. NTA అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసిన తర్వాత, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను jeemain.nta.ac.inని సందర్శించవచ్చు. ఇందులో నుంచి అభ్యర్ధులు అడ్మిట్ కార్డ్‌లను తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
JEE మెయిన్ 2024 అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా ?
1. అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ను ఓపెన్ చేయాలి.
2. హోమ్‌పేజీలో JEE మెయిన్ 2024 అడ్మిట్ కార్డ్ (లింక్ యాక్టివ్ అయిన తర్వాత) అని ఉన్న లింక్‌పై క్లిక్ చేయాలి.
3. స్క్రీన్‌పై కొత్త పేజీ కనిపిస్తుంది.
4. అడిగిన ఆధారాలను నమోదు చేసి, సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
5. అనంతరం అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
6. ఇక్కడ అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలాగే భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవాలి.
మరిన్ని అప్‌డేట్‌ల కోసం, అభ్యర్థులు JEE మెయిన్స్ 2024 అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.












Click it and Unblock the Notifications