SBI Warning: ఆన్ లైన్లో ఎస్బీఐ నకిలీ సెలక్షన్ లిస్టులు-అభ్యర్ధులకు హెచ్చరికలు..

దేశంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధులకు ఇప్పుడు నకిలీల బెడద ఎక్కువైపోయింది. అప్లికేషన్ నుంచి మొదలుపెట్టి సెలక్షన్ లిస్ట్ వరకూ ఎక్కడ చూసినా నకిలీలే. విచ్చలవిడిగా పుట్టుకొస్తున్న వెబ్ సైట్లలో నకిలీల హవా కొనసాగుతోంది. దీంతో ఏది అసలు, ఏది నకలో తేల్చుకునేలోపే కేటుగాళ్లు అభ్యర్ధుల్ని తప్పుదోవ పట్టించి దోపిడీ చేసేస్తున్నారు. ఈ మోసాలు నానాటికీ ఎక్కువవుతుండటంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఉద్యోగార్ధులకు హెచ్చరికలు జారీ చేసింది.

స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు పరీక్షలు రాసిన తర్వాత ఫలితాల కోసం ఎదురుచూస్తుంటారు. ఇలాంటి వారిని టార్గెట్ చేసుకుని పలు వెబ్ సైట్లలో ఇప్పుడు నకిలీ సెలక్షన్ లిస్టులు, నకిలీ అపాయింట్ మెంట్ లెటర్లు కూడా వైరల్ చేసేస్తున్నారు. వీటిని నమ్మి క్లిక్ చేస్తే అభ్యర్ధులు దోపిడీకి గురవడం ఖాయం. అలాగే ఫేక్ లింక్స్ క్లిక్ చేయడం ద్వారా మన కంప్యూటర్లు సైతం హ్యాక్ అయ్యే ప్రమాదం పొంచి ఉంటోంది. దీనిపై ఎస్బీఐ అభ్యర్ధులను హెచ్చరిస్తోంది.

SBI latest warning to applicants over fake selection lists visible online

వెబ్ సైట్లలో సెలక్షన్ జాబితాలు తాము పెట్టడం లేదని, వాటి కోసం అభ్యర్ధులు తమ అధికారిక వెబ్ సైట్లను మాత్రమే సంప్రదించాల్సి ఉంటుందని ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. తాము కేవలం ఎంపికైన అభ్యర్ధుల రోల్ నంబర్లు, రిజిస్ట్రేషన్ నంబర్లను మాత్రమే ప్రచురిస్తామని, వాటిని కూడా ఎస్సెమ్మెస్, ఈ-మెయిల్, పోస్టు ద్వారా మాత్రమే అభ్యర్ధులకు నేరుగా పంపుతామని తెలిపింది. తాము నోటిఫికేషన్ లో పేర్కొన్న అధికారిక వెబ్ సైట్ మినహా మరే ఇతర వెబ్ సైట్లను ఆశ్రయించవద్దని ఎస్బీఐ ఈ ప్రకటనలో అభ్యర్ధులకు సూచించింది.

ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ తరహాలోనే కొన్ని వెబ్ సైట్లను హ్యాకర్లు, మోసగాళ్లు తయారు చేసి వాటి ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని బ్యాంకు తెలిపింది. వీటిలో నకిలీ సెలక్షన్ లిస్టుల్ని కూడా ఉంచుతున్నారని, కాబట్టి ఒకటికి రెండుసార్లు అసలు, నకిలీని చెక్ చేసుకోవాలని సూచిస్తోంది. https://www.sbi.co.in/careers and https://bank.sbi/careers వెబ్ సైట్లు మాత్రమే తమ అధికారిక వెబ్ సైట్లుగా ఉద్యోగార్ధులు గుర్తించాలని కోరుతోంది. ఉద్యోగాల నోటిఫికేషన్ల దగ్గరి నుంచి, పరీక్ష తేదీలు, ఫీజులు, ఇంటర్వ్యూలు, జాబ్ సెలక్షన్ లిస్టులు, అన్నీ ఇందులోనే ఉంటాయని చెబుతోంది. కాబట్టి అభ్యర్ధులు జాగ్రత్తగా పరిశీలించాలని, మోసపోవద్దని కోరుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+