Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Super 30 Anandkumar: ఇక ఆన్ లైన్లోనూ సూపర్ 30 ఆనంద్ కుమార్ క్లాసులు..!

బీహార్ లో వెనుకబడిన, పేద వర్గాలకు నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో పాఠాలు చెప్పి ఎందరినో గొప్ప గొప్ప లక్ష్యాలకు చేరువ చేసిన సూపర్ 30 ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ గతంలో బయోపిక్ తీశారు. ఇందులో పేద విద్యార్ధులను ఐఐటియన్లుగా మార్చేందుకు ఆనంద్ కుమార్ చేసిన పోరాటం ప్రతీ ఒక్కరి హృదయాలను తాకేలా ఉంటుంది. కొన్నేళ్లుగా పేద విద్యార్ధుల కోసమే మ్యాథ్స్ చెబుతున్న ఆయన.. ఇప్పుడు మరింత మంది విద్యార్దుల్ని చేరువయ్యేందుకు సిద్దమయ్యారు.

దేశంలోని పేద, వెనుకబడిన విద్యార్థుల ఇంటి వద్దకు విద్యను తీసుకెళ్లడానికి త్వరలో కొత్త ఆన్‌లైన్ విద్యా వేదికను ప్రారంభించనున్నట్లు ఆనంద్ కుమార్ ఇవాళ ప్రకటించారు.కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీ నిర్వహించిన "రీఇమేజినింగ్ ఇండియా: షేపింగ్ ది గ్లోబల్ ఎకనామిక్ ల్యాండ్‌స్కేప్" అనే అంశంపై 2024 కెల్లాగ్ ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్‌లో ఆనంద్ ఈ మేరకు ప్రకటన చేశారు.

Super 30 founder Anand Kumar plans to launch online platform to reach more students

అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత ఎక్కువ మంది విద్యార్థులకు చేరవేయడానికి సమయం ఆసన్నమైందని ఆనంద్ కుమార్ వెల్లడించారు. సూపర్ 30 పేదలు వారి జీవితాలను మార్చుకోవాలనే ఆకాంక్షలను పెంచేలా చేసిందని, విద్య యొక్క శక్తి కారణంగా ఉత్తీర్ణులైన చాలా మంది విద్యార్థులు తరాల మార్పు గురించి ఆలోచించారన్నారు. తన సూపర్ 30 ప్రోగ్రామ్ కు కొనసాగింపుగా పేదల ఇంటి వద్దకు విద్యను తీసుకెళ్లడానికి కొత్త ఆన్‌లైన్ విద్యా వేదిక త్వరలో ప్రారంభిస్తానని ఆయన వెల్లడించారు.

Super 30 founder Anand Kumar plans to launch online platform to reach more students

ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ప్రారంభంతో ప్రతి నిరుపేద విద్యార్థి చదువుకునేలా చూడాలన్న తన కల నెరవేరుతుందని ఆనంద్ కుమార్ అన్నారు.పేదవారు కూడా నాణ్యమైన విద్యకు అర్హులని, ప్రజలు విద్యుత్, స్వచ్ఛమైన నీరు, సరైన ఆహారం కూడా లేని దేశాలు, గ్రామాల్లో పేదరికాన్ని అనుభవించడానికి ల్యాబ్‌ల నుండి బయటకు వెళ్లవలసిన సమయం ఆసన్నమైందన్నారు.ప్రపంచం ప్రతిభావంతులైన వ్యక్తులతో నిండి ఉందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా పేదరికం కారణంగా ప్రపంచం దృష్టికి మరుగునపడిన చిన్నారులు ఎందరో ఉన్నారన్నారు. వారు న్యూటన్, రామానుజన్‌గా మారగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారన్నారు. కానీ అవకాశం లేకపోవడం వల్ల వారి ప్రతిభ వృథా పోతుందన్నారు. ఇప్పుడు తన ఆన్‌లైన్ ప్లాట్ ఫామ్ వారికి రాణించడానికి వేదికను అందించడమే లక్ష్యంగా ఉందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+