Education: ఇక కాలేజీల్లో షార్ట్ టర్మ్ స్కిల్ కోర్సులు- యూజీసీ మార్గదర్శకాలివే..!
ప్రస్తుత కాలంలో కాలేజీల్లో చదువులకూ, ఆ తర్వాత చేయాల్సిన ఉద్యోగాలకు అస్సలు పొంతన ఉండటం లేదు. ముఖ్యంగా కాలేజీల్లో చదువుకుని డిగ్రీలు తీసుకున్నా వాటి ఆధారంగా ఉద్యోగాలు వస్తాయన్న గ్యారంటీ లేకుండా పోతోంది. ఈ గ్యాప్ తగ్గించేందుకు యూజీసీ పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఉన్నత విద్యాసంస్ధల్లో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు వీలుగా స్వల్పకాలిక కోర్సుల్ని ప్రతిపాదిస్తోంది. ఈ కోర్సుల్ని ప్రవేశపెట్టేందుకు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.
ఉన్నత విద్యాసంస్ధల్లో 29 స్వల్పకాలిక స్కిల్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు వీలుగా యూజీసీ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిపై సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరుతోంది. యూజీసీ ప్రతిపాదిస్తున్న కోర్సుల్లో కృత్రిమ మేథ, మెషీన్ లెర్నింగ్, ఏఐ రోబోటిక్స్, ఐఓటీ, ఇండస్ట్రీస్ ఐఓటీ, డేటా సైన్స్, అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటివి ఉన్నాయి. వీటిని కళాశాల స్దాయిలోనే నేర్చుకోవడం ద్వారా ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాల్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోంది.

ఈ కోర్సుల్ని ప్రారంభించేందుకు కాలేజీల్లో మౌలిక సదుపాయాలతో పాటు శిక్షణా సామర్ధ్యం కూడా తప్పనిసరి. కాబట్టి కాలేజీల సామర్ధ్యాలను బట్టి వీటి ఏర్పాటుకు అనుమతిస్తోంది. కంప్యూటర్ ల్యాబ్స్, యంత్ర పరికరాలు తప్పనిసరిగా ఉండాలని యూజీసీ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. అలాగే పరిశ్రమలతో ఆయా కాలేజీలు ముందస్తు ఒప్పందాలు చేసుకోవాలని సూచిస్తోంది. వీటితో పాటు కాలేజీల్లో శిక్షణ కోసం అనుభవజ్ఞుల, నిపుణుల సేవల్ని వాడుకోవాలని యూజీసీ చెబుతోంది.
ఇలా ప్రారంభిస్తే కోర్సులకు 3 నుంచి 6 నెలల వ్యవధి ఉండాలని యూజీసీ మార్గదర్శకాల్లో పేర్కొంది. వారంలో ఓ గంట పాటు థియరీ క్లాసులు, రెండు గంటల పాటు ప్రాక్టికల్ క్లాసులు ఉండేలా చూడాలని తెలిపింది. థియరీలో 15 గంటలకు ఓ క్రెడిట్, ప్రాక్టికల్స్ అయితే 30 గంటలకు ఓ క్రెడిట్ ఇవ్వాలని సూచిస్తోంది. అలాగే క్లాస్ రూమ్ లో ఒక్కో ఫ్యాకల్టీకి 30 మంది విద్యార్ధుల నిష్పత్తి ఉండాలని తెలిపింది. ప్రతీ విద్యాసంస్ధ కూడా ప్రతీ కోర్సుకూ ముందుగానే ఫీజులు నిర్ణయించి సొంత నిధులతో వీటిని నిర్వహించేలా చూడాలని సూచిస్తోంది.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications