నెట్ ఫ్లిక్స్ బాటలోనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్-యూజర్లకు షాకింగ్ న్యూస్ !
ఇదీ ఓటీటీల కాలం. థియేటర్లు, మల్టీప్లెక్స్ లకు వెళ్లి సినిమాలు చూసే రోజులు పోతున్నాయి. క్రమంగా సినిమాలతో పాటు స్ధానిక, జాతీయ, అంతర్జాతీయ భాషల్లో నాణ్యమైన కంటెంట్ అందించే ఓటీటీల సంఖ్య పెరుగుతోంది. అలాగే వీటి డిమాండ్, సబ్ స్క్రిప్షన్ రేట్లు కూడా పెరుగుతున్నాయి. దీంతో అంతంత రేట్లు పెట్టి ఈ ఓటీటీల్ని సబ్ స్క్రైబ్ చేసుకోలేని కొందరు యూజర్లు కూడా అడ్డదారులు తొక్కుతున్నారు. ముఖ్యంగా యువత సిండికేట్ గా మారి ఒకరు సబ్ స్క్రైబ్ చేసుకోవడం మిగతా వాళ్లు ఆ పాస్ వర్డ్ పంచుకుని కంటెంట్ వీక్షించడం పెరుగుతోంది. దీంతో ఓటీటీ సంస్ధలకు నష్టం వాటిల్లుతోంది.
ప్రస్తుతం మన దేశంలోనే చాలా మంది వ్యక్తులు వివిధ ఓటీటీ సేవలను వాడుతున్నప్పటికీ వాటిలో దేనికీ నిజంగా చెల్లించడం లేదని తాజా నివేదికలు చెబుతున్నాయి. చాలా కాలంగా ఇదే పరిస్దితి నెలకొంది. దీంతో ఇలా రూపాయి కూడా చెల్లించకుండానే కంటెంట్ ను పాస్ వర్డ్ షేరింగ్ ద్వారా వీక్షిస్తున్న వారికి చెక్ పెట్టేందుకు ఓటీటీలు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే జూలై నెలలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ తమ సబ్ స్క్రైబర్లు తమ కుటుంబ సభ్యులకు కాకుండా ఇతరులకు పాస్ వర్డ్ షేర్ చేయకుండా ఆంక్షలు విధించింది. ఇప్పుడు మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కూడా అదే బాట పట్టింది.

ప్రస్తుతం కెనడాలో యూజర్లకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్ధ తమ సబ్ స్క్రైబర్లు పాస్ వర్డ్ షేర్ చేసుకోకుండా ఆంక్షలు విధించింది. నవంబర్ 1 నుండి కెనడాలోని వినియోగదారులు ఇకపై తమ పాస్‌వర్డ్‌లను తమ ఇంటి వెలుపల ఉన్న వారితో పంచుకోలేరు. కెనడాలోని డిస్నీ ప్లస్ సబ్‌స్క్రైబర్‌లకు పంపిన ఇమెయిల్ ద్వారా మార్పును తెలియజేసింది. ఇకపై వినియోగదారులు తమ పాస్ వర్డ్ లను తమ కుటుంబ సభ్యులకు కాకుండా ఇతరులకు పంచుకోవడాన్ని నియంత్రిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఇన్నాళ్లూ పాస్ వర్డ్ లను విచ్చలవిడిగా ఫ్రెండ్స్ కు షేర్ చేసిన వారు, వాటిని వినియోగిస్తున్న వారూ
షాకయ్యారు. త్వరలో భారత్ లోనూ ఇదే విధానం అమలు చేసేందుకు డిస్నీ సిద్ధమవుతోంది.
గతంలో నెట్ ఫ్లిక్స్ కూడా తాము ఎంపిక చేసుకున్న దేశాల్లో వినియోగదారులు ఇలా పాస్ వర్డ్ షేర్ చేయకుండా ఆంక్షలు విధించింది. మొదట్లో ఓ దేశంతో మొదలుపెట్టి మిగతా దేశాలకూ ఇదే పాలసీని విస్తరిస్తోంది. ఇప్పుడు డిస్నీ ప్లస్ కూడా ఇదే బాటలో కెనడా తర్వాత ఇతర దేశాలకూ దీన్ని విస్తరించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతానికి భారత్ లో ఈ నిబంధన వర్తించకున్నా రాబోయే రోజుల్లో కచ్చితంగా డిస్నీ కూడా నెట్ ఫ్లిక్స్ బాటలోనే పయనించనున్నట్లు సమాచారం.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!












Click it and Unblock the Notifications