అందాల ఆరబోత మొదలెట్టానన్న అనసూయ
యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించి సినిమాలలో దూసుకుపోతున్న అనసూయ భరద్వాజ్ ఈమధ్య గ్లామర్ డోస్ ను మరింత పెంచేశారు. తన గ్లామర్ బయటపడేలా ఫోటోషూట్లు చేస్తూ కుర్ర కారుకు పిచ్చెక్కిస్తున్న అనసూయ తాజాగా సింబా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సింబా ట్రైలర్ లాంచ్ లో అనసూయ
జగపతిబాబు, గౌతమి, దివివాద్య, కస్తూరి, మురళీ మనోహర్ వంటి నటీనటులు కీలక పాత్రలో రూపొందిన సింబా సినిమాలో అనసూయ భరద్వాజ్ కీలక పాత్ర పోషించారు. ఆగస్టు 9వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నా గ్లామర్ ను ప్రొజెక్ట్ చేస్తానన్న అనసూయ
రంగస్థలం, పుష్ప వంటి సినిమాల తర్వాత ఆమెకు మంచి ఆఫర్లు వస్తున్నప్పటికీ అనసూయ రిజెక్ట్ చేస్తున్నారు.. ఎందుకు అని ఈ అంశం పైన ప్రశ్నించిన మీడియాకు సమాధానం చెప్పిన అనసూయ వచ్చిన పాత్రలే మళ్లీ మళ్లీ వస్తే తాను చేయదలుచుకోలేదని చెప్పారు. ఒక తెలుగు అమ్మాయిగా తనకు చాలా భాషల్లో అవకాశం వస్తుందని, ఇకపై తన గ్లామర్ ని ప్రొజెక్ట్ చేద్దామని అనుకుంటున్నానని అనసూయ భరద్వాజ్ వెల్లడించారు.
నా బాడీ ... గ్లామర్ ఉన్నంతకాలం షో ఆఫ్ చేస్తా
గ్లామర్ ను మెయింటైన్ చేయగలిగేంతవరకు తాను ఇలానే షో ఆఫ్ చేస్తానని, గ్లామరస్ గా కనిపించే విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదని అనసూయ పేర్కొన్నారు. ఎందుకంటే ఇది నా బాడీ.. ఇదే నేను.. నాలాగా ఎవరూ లేరని అనుకుంటాను అంటూ అనసూయ షాకింగ్ సమాధానం చెప్పారు. ఇక వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకుంటూ పోతే ఆఫర్లు వస్తాయా అని అడిగిన ప్రశ్నకు సరైన క్యారెక్టర్ వస్తే దానికి దిమ్మతిరిగే రెమ్యునరేషన్ అడుగుతానంటూ సమాధానం చెప్పారు.
విజయ్ దేవరకొండతో గొడవపై అనసూయ ఇలా
ఇక సినిమాల విషయాల్లో తన భర్త జోక్యం ఏది ఉండదని అనసూయ వెల్లడించారు. ఇదే సమయంలో విజయ్ దేవరకొండ తో గొడవకి ఫుల్ స్టాప్ పడిందా అని అడిగిన ప్రశ్నకు నేను దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకోవడం లేదు అంటూ మాట్లాడిన అనసూయ సినిమాలతో ఏ విధంగా అయితే మెసేజ్ ఇస్తారో అప్పుడు కూడా నేను అలానే ఇవ్వాలని రియాక్ట్ అయ్యాను అన్నారు.
తనకు ఎవరిమీద ద్వేషం లేదన్న అనసూయ
ఆ రోజు మీరు ఎవరు మాట్లాడకపోవడంతోనే తను మాట్లాడాల్సి వచ్చిందని అప్పుడు మీడియా ఎందుకు ప్రశ్నించలేదంటూ అనసూయ మీడియాను ప్రశ్నించారు.తానూ విజయ్ దేవరకొండ తో స్టేజి మేనర్స్ గురించే ఆరోజు మాట్లాడానని, లైమ్ లైట్ లో ఉన్నప్పుడు పద్ధతిగా ఉండాలని చెప్పానని, అంతకుమించి తనకు ఎవరిపైన ద్వేషం లేదని అనసూయ తెలిపారు.












Click it and Unblock the Notifications