బాలకృష్ణ అలాంటోడు.. స్వర్ణోత్సవ వేడుకల వేళ బాబీ డియోల్ సంచలనం!
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బాలకృష్ణ 50 సంవత్సరాలు సినీ ప్రస్తానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు తెలుగు చిత్ర పరిశ్రమ రెడీ అవుతుంది. నటుడిగా బాలకృష్ణ నేటికీ ఒక విలక్షణమైన శైలిలో తెలుగు ప్రేక్షకులకు అత్యంత సన్నిహితంగా కనిపిస్తారు.
బాలయ్య క్యారెక్టర్ పై బాబీ డియోల్
ఇక చాలామంది బాలకృష్ణ క్యారెక్టర్ గురించి కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తారు. బాలకృష్ణకు కోపం ఎక్కువ వస్తుందని, కోపం వస్తే ఫ్యాన్స్ ను కొట్టేస్తారని అనేక సందర్భాలలో ఆయన పైన చర్చ జరిగింది. అయితే తాజాగా నందమూరి నరసింహ బాలకృష్ణ పైన యానిమల్ సినిమాలో విలన్ గా నటించిన బాబి డియోల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

బాలయ్య సినిమాలో విలన్ గా బాబీ డియోల్
నటుడు బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబి డియోల్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యానిమల్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆయనకు వరుసగా ఆఫర్లు రావడంతో టాలీవుడ్ లో ఆయన చాలా బిజీ అయిపోయారు. ఇక బాలకృష్ణ నటిస్తున్న NBK 109 సినిమాలోనూ బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్నారు. ఈ సినిమా, బాలకృష్ణ వ్యక్తిత్వంపైన బాబి డియోల్ తాజాగా సంచలనవ్యాఖ్యలు చేశారు.
బాలకృష్ణ అలాంటి వాడు
బాలకృష్ణతో వర్క్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని ఆయన పేర్కొన్నారు. బాలకృష్ణ చాలా సీనియర్ అయినప్పటికీ ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం అంటూ బాబీ డియోల్ తెలిపారు. ఈ వయసులో కూడా బాలకృష్ణ ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటారని బాలకృష్ణ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న NBK 109 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
NBK 109 సినిమా టైటిల్ టీజర్ బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల్లో రిలీజ్
ఈ సినిమాను బాబి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ టీజర్ ను బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానం వేడుకలలో రిలీజ్ చేయనున్నట్టు ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అయితే త్వరలోనే దీనిపైన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా బాలయ్య మనస్తత్వం చిన్నపిల్లాడి మనస్తత్వం అని బాబీ డియోల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలయ్య బాబు క్యారెక్టర్ గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాయి.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications