డాకు మహారాజ్.. యూఎస్ఏలో బాలకృష్ణ అరుదైన రికార్డు!
సంక్రాంతి పండుగకు పోటాపోటీగా సినిమాలు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో ఎన్బికె 109వ చిత్రంగా డాకు మహారాజ్ ప్రపంచ వ్యాప్తంగా సందడి చేస్తోంది. జనవరి 12వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా తొలి రోజే బ్లాక్ బస్టర్ గా టాక్ తెచ్చుకుంది.
యూఎస్ఏలో మిలియన్ డాలర్ మార్క్ సాధించిన బాలయ్య సినిమా
ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ సినిమా మొదటి రోజు 56 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ఇక ఇదే సమయంలో తాజాగా బాలయ్య బాబు సాధించిన మరొక విజయం పైన చర్చ జరుగుతుంది. యూఎస్ఏ లో వరుసగా నాలుగు సినిమాలు వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్ హీరోగా బాలకృష్ణ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.

ఈ రికార్డ్ బాలయ్య కే సొంతం
డాకు మహారాజ్ యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద 6. 50 కోట్లు , ఒక మిలియన్ డాలర్స్ మార్క్ చేరుకుంది. ఇప్పటివరకు బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి, అఖండ, భగవంత్ కేసరి సినిమాల తో పాటు ప్రస్తుతం డాకు మహారాజ్ కూడా నాలుగవ సినిమాగా మిలియన్ డాలర్ మార్కును చేరుకుంది. ఇప్పటివరకు ఇట్లాంటి ఘనత వహించిన టాలీవుడ్ హీరో ఒక్క బాలకృష్ణ మాత్రమే కావడంతో ప్రస్తుతం అభిమానుల్లో జోష్ నెలకొంది.
64ఏళ్ళ వయసులోనూ అదరగొట్టిన బాలయ్య
బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కాగా, 64 ఏళ్ల వయసులో కూడా బాలయ్య బాబు సాధిస్తున్న రికార్డుల పరంపర బాలయ్య ఫ్యాన్స్ కు సంతోషం కలిగిస్తుంది. ఇప్పటికే బాలకృష్ణ మేనియా పెద్ద ఎత్తున కొనసాగుతుండగా, రాబోయే రోజుల్లో బాలకృష్ణ బాక్సాఫీస్ మేనియా ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
అభిమానులను ఆకట్టుకునే మార్క్ చూపిస్తున్న బాలయ్య
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బ్యానర్ల పైన సూర్యదేవర నాగ వంశీ , సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలయ్య తన అద్భుతమైన నటనతో అదరగొట్టాడు. ఇక థియేటర్లలో సందడి చేస్తూ రికార్డులను కూడా బద్దలు కొడుతున్నాడు. నటించిన ప్రతీ సినిమాలోనూ అభిమానులను ఆకట్టుకునే తన మార్క్ చూపిస్తున్నారు.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
ఖమేనీ సంధి ఒప్పందం? -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications