Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'పాకిస్థాన్‌లో 80 శాతం మంది ‘గే’లే!'

బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 17 రోజుల్లోనే దాదాపు 1500 కోట్ల రూపాయల మైలురాయిని దాటిని ఈ చిత్రం సంచలనం సృష్టిస్తుండగా.. తాజాగా పాకిస్థానీ ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్ హీనా బలోచ్ చేసిన వివాదాస్పద కామెంట్లతో ఈ సినిమాలోని ఓ సీన్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పాకిస్థాన్ జనాభాలో అత్యధికులు 'గే' (Gay) అని ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇరు దేశాల్లో చర్చనీయాంశంగా మారాయి.

పాకిస్థాన్ అసలు రంగు బయటపెట్టిన హీనా బలోచ్
పాకిస్థాన్ దేశానికి చెందిన హీనా బలోచ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పాకిస్థాన్ జనాభాలో సుమారు 80 శాతం మంది గే అని, మిగిలిన 20 శాతం మంది బైసెక్సువల్ అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సమాజం మతం, కుటుంబ ఒత్తిడి కారణంగా అక్కడ ఎవరూ తమ అసలు లైంగిక గుర్తింపును బయటపెట్టరని ఆమె పేర్కొన్నారు. "పాకిస్థాన్ లో ఎవరూ స్ట్రైయిట్ కాదు.. ఇది అందరికీ తెలిసిన రహస్యంఠ అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు 'ధురంధర్' సినిమాలోని ఓ కీలక సన్నివేశాన్ని గుర్తు చేస్తున్నాయి.

Hina Baloch Viral Claim Sparks Dhurandhar 2 Movie Scene Debate Says 80 Percent of Pakistanis are Gay

ట్రెండింగ్‌లో రణవీర్ సింగ్ సీన్
ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్' మొదటి భాగంలో రణవీర్ సింగ్(హమ్జా అలీ మజారీ పాత్రలో) భారతీయ గూఢచారిగా పాకిస్థాన్‌లోని లియారీ ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ గ్యాంగ్‌స్టర్ రెహమాన్ డకైత్(అక్షయ్ ఖన్నా) గ్యాంగ్‌లో చేరే క్రమంలో మొదటి రోజే హమ్జా లైంగిక వేధింపులకు గురవుతాడు. లుల్లీ డకైత్ అనే పాత్ర ద్వారా హమ్జాను లైంగికంగా వేధించే ఆ సన్నివేశాన్ని దర్శకుడు ఎంతో లోతుగా, వాస్తవికతకు దగ్గరగా చిత్రీకరించారు. రణవీర్ సింగ్ ఆ సమయంలో చూపించిన హావభావాలు, ఆ వేదన ఇప్పుడు హీనా బలోచ్ కామెంట్లతో ముడిపడి వైరల్ అవుతున్నాయి.

ఆదిత్య ధర్ 'డీటెయిలింగ్' అంటే ఇదేనా?
దర్శకుడు ఆదిత్య ధర్ పాకిస్థాన్‌లోని అట్టడుగు ప్రాంతాల్లో ఉండే వాస్తవ పరిస్థితులను ఎంత నిశితంగా పరిశీలించి ఈ సినిమా తీశారో హీనా బలోచ్ కామెంట్స్ నిరూపిస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా రణవీర్ సింగ్ పోషించిన హమ్జా పాత్ర అతని కెరీర్‌లోనే అత్యుత్తమమైనదని, పాకిస్థాన్‌లోని చీకటి కోణాలను ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓ వైపు సినిమా రికార్డు స్థాయి వసూళ్లు, మరోవైపు ఈ వివాదాస్పద కామెంట్స్ 'ధురంధర్' ఫ్రాంచైజీని వార్తల్లో నిలుపుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+