హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్.. ఓటీటీలో ఈవారం సినిమాలు, వెబ్ సీరీస్ రచ్చ ఇలా!!
థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో, ఓ టి టి లలో వస్తున్న సినిమాలకు కూడా అంతే క్రేజ్ పెరిగిపోయింది. ఇటీవల కాలంలో ఓటీటీలలో వచ్చే సినిమాలకు ఆదరణ బాగా పెరిగింది. అంతేకాదు సిరీస్ లకు కూడా ఓ రేంజ్ లో ఫ్యాన్స్ తయారయ్యారు. ప్రతివారం ఓటీటీలలో రిలీజ్ అయ్యే సినిమాల కోసం సినిమా ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సిరీస్ల విషయమైతే చెప్పనక్కర్లేదు.
ఇక ఈ వారం ఓ టి టి లో రిలీజ్ అయ్యే సినిమాల విషయానికొస్తే.. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏప్రిల్ 7వ తేదీ వరకు అనేక సినిమాలు ఓటిపి ప్లాట్ ఫామ్ లో సందడి చేయనున్నాయి. గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన భీమ సినిమా మార్చి 8వ తేదీన థియేటర్లో రిలీజ్ కాగా నెల రోజుల్లో పై ఓ టి టి లోకి ఎంట్రీ ఇస్తుంది.

భీమ సినిమా ఏప్రిల్ 5వ తేదీ నుండి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ఇప్పటికే రెండు ఓటిటి ప్లాట్ఫామ్ లలో స్ట్రీమింగ్ అవుతున్న హనుమాన్ సినిమా ఏప్రిల్ 5నుంచి హాట్ స్టార్ లోకి రానుంది. అంతేకాదు బిగ్ బాస్ లో తన అందాలతో ఆకట్టుకున్న దివి నటించిన లంబసింగి సినిమా థియేటర్లో రిలీజ్ అయిన నెల రోజుల్లో పై ఓ టి టి లోకి వస్తుంది.
రేపటి నుంచి లంబసింగి సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే పారాసైట్ ద గ్రే సిరీస్ కూడా ఏప్రిల్ 5 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. కే డ్రామా ప్లాట్ లో కొనసాగే ఓ మంచి హర్రర్ సస్పెన్స్ పారసైట్ ద గ్రే. ఏప్రిల్ 5వ తేదీ నుంచి జీ5 ఓ టి టి లో ఫారీ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా మంచి థ్రిల్లర్ సినిమా. కాగా సోనీ లివ్ లో ఏప్రిల్ మూడవ తేదీ నుంచి ఫ్యామిలీ ఆజ్ కల్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అంతేకాదు అమెజాన్ మినీ టీవీలో ఏప్రిల్ 4 నుంచి ఏ మేరే ఫ్యామిలీ 3 మూడవ సీజన్ స్ట్రీమింగ్ కానుంది.












Click it and Unblock the Notifications