Samantha: నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్.. సమంత సంచలన పోస్ట్!!

టాలీవుడ్ హీరో నాగచైతన్య, సమంతతో విడిపోయిన తర్వాత మళ్లీ రెండో వివాహం చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇక నాగచైతన్య శోభిత దూళిపాళ గురించి గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. వారిద్దరూ లవ్ లో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

నాగ చైతన్య శోభిత ధూళిపాళ పై చర్చ
ఇక ఆ ప్రచారానికి ఊతమిస్తూ నాగ చైతన్య శోభిత ఇద్దరు లండన్ లోని హోటల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వారిద్దరి రిలేషన్ ను బయటపెట్టాయి.ఇక నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత పెట్టిన అనేక పోస్టులు నాగచైతన్య పర్సనల్ లైఫ్ ని టార్గెట్ చేసి పెట్టినట్టుగా కూడా చర్చ జరిగింది. ఇక తాజాగా మరో మారు నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

Naga Chaitanya Sobhita Dhulipala Engagement Samantha Shocking Post

నేడు నాగ చైతన్య నిశ్చితార్ధం
వీరిద్దరూ హైదరాబాద్ లోని తమ నివాసంలో నేడు నిశ్చితార్థం చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో ఒక వార్త సంచలనం సృష్టిస్తోంది అయితే ఈ వార్తకు సంబంధించి ఖండన కానీ, ధ్రువీకరణ కానీ లేకపోవడంతో నాగచైతన్య జీవితంలో ఏదో జరగబోతుంది అన్నది ప్రస్తుతం అందరికీ ఆసక్తిని రేకెత్తిస్తుంది.

నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ వార్త,. సమంత షాకింగ్ పోస్ట్
ఒకవైపు నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ వార్త బయటకు రావడానికి ముందు సమంత ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కష్టాలను, ప్రతికూల పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొన్న వాళ్ళు ఎప్పుడూ ఒంటరి వాళ్ళు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటూ సమంత తన పోస్టులో పెట్టారు.

సవాళ్లు ఎదుర్కొన్న వాళ్ళను పైనుండి ఒక శక్తి కాపాడుతుంది అంటూ
జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొన్న వాళ్ళను పైనుంచి ఓ శక్తి తప్పకుండా కాపాడుతుందని, ఎల్లప్పుడూ ఆ శక్తి నీ చుట్టూ రక్షణగా ఉంటుందని అలాంటి సమయంలో నీ మానసిక స్థితిని చాలా గొప్పది. నీకు ఎప్పుడూ మేమంతా అండగా ఉంటామంటూ వినేష్ ఫోగట్ గురించి సమంత ఒక పోస్ట్ పెట్టారు.

వినేశ్ ఫోగట్ కోసం పోస్ట్ పెట్టినా ఆమె ఉద్దేశం వేరే అంటూ నెటిజన్లు కామెంట్స్
అయితే సమంత వినేష్ తో పాటు పరోక్షంగా తన జీవితాన్ని కూడా ప్రస్తావిస్తూ పోస్ట్ చేస్తుందని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. నాగచైతన్య శోభిత ధూళిపాళ్ళ ఎంగేజ్మెంట్ నేపథ్యంలోనే సమంత ఈ పోస్ట్ పెట్టినట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం సమంత పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+