రామ్ చరణ్ పెద్ద ఛీటర్.. నిహారిక అసలు విషయం చెప్పిందిగా!!

మెగా డాటర్ నిహారిక ఏ విషయమైనా బోల్డ్ గా మాట్లాడేస్తుంది. మెగా ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొట్టమొదటి హీరోయిన్ నిహారిక అనే చెప్పాలి. పెద్దగా సినిమాలలో నిహారిక సక్సెస్ సాధించనప్పటికీ ఎప్పుడూ వార్తల్లో నిహారిక ఉంటూనే ఉంటారు. ఇక ఇటీవల ఆగస్టు 9వ తేదీన కమిటీ కుర్రాళ్ళు అనే టైటిల్ తో తెరకెక్కే సినిమాలో నిహారిక కొణిదల నటిస్తున్నారు.

రామ్ చరణ్ ఛీటర్ అన్న నిహారిక
ఈ సినిమా ప్రమోషన్స్ కు సంబంధించి అనేక ఇంటర్వ్యూలను ఇస్తున్న నిహారిక తాజాగా రామ్ చరణ్ గురించి ఎవరికీ తెలియని విషయాలు చెప్పారు. రామ్ చరణ్ పెద్ద ఛీటర్ అంటూ నిహారిక కొణిదెల రామ్ చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తాను నూతన గృహప్రవేశం చేసిందని, ఆ సమయంలో రామ్ చరణ్ ,సాయి ధరంతేజ్, వరుణ్ తేజ్ ఇలా అందరూ తన ఇంటికి వచ్చారని పేర్కొన్నారు.

Niharika konidela shocking comments on ram charan is a cheater

తన మెమరీ షేర్ చేసిన నిహారిక
తన కొత్త ఇంటికి అందరూ వచ్చిన సందర్భంలో అప్పుడు బయట బిజీ మర్చిపోయి అందరూ సరదాగా రెండున్నర గంటల పాటు ఆడుకున్నామంటూ చెప్పారు. చిన్నపిల్లల మాదిరిగా తామంతా దంషరాట్స్, ఇలా చాలా ఆటలు ఆదుకున్నామని, మేమంతా ఆడుకోవడం తాను మర్చిపోలేని ఒక మెమరీ అని నిహారిక తెలిపారు.

గేమ్ చేంజర్ బాగా గేమ్ ఆడతాడన్న నిహారిక
అంతేకాదు ఏ ఆట ఆడిన రామ్ చరణ్ చీటింగ్ చేస్తాడని, రామ్ చరణ్ పెద్ద చీటర్ అంటూ నిహారిక తెలిపారు. గేమ్ చేంజర్ ఆటను బాగా మార్చేస్తాడని ఎప్పుడూ ఆటలో తానే గెలుస్తాడని నిహారిక చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ తో తన అనుబంధాన్ని గురించి చెబుతూ పవన్ ఎప్పుడూ తనను తల్లి అని పిలుస్తాడని ఇటీవల ఒక సందర్భంలో నిహారికను చూసి జిరాఫీలా ఉన్నావని అన్నాడని నిహారిక పేర్కొన్నారు.

నిహారిక షాకింగ్ ఇంటర్వ్యూ వైరల్
మెగా ఫ్యామిలీలో అందరూ తనను గారాబంగానే చూస్తారని, తనని అందరూ ఇష్టపడతారని, తనకి కూడా అందరి మీద అంతే ప్రేమ ఉంటుందని నిహారిక పేర్కొన్నారు. తాజాగా నిహారిక ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. కమిటీ కుర్రాళ్ళు సినిమా ప్రమోషన్ లో పాల్గొంటున్న నిహారిక మెగా ఫ్యామిలీకి చెందిన అనేక సీక్రెట్స్ ను బయట పెడుతూ ఉండడం ఆసక్తిని కలిగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+