మెగా ఫ్యాన్స్‌కి బిగ్ షాక్.. రామ్ చరణ్ "పెద్ది" వాయిదా తప్పదా !!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ( ram charan ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం "పెద్ది". ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చరణ్ కెరీర్‌లోనే ఒక డిఫరెంట్ అండ్ రా ప్రాజెక్ట్‌గా నిలవనుందని భావిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ మూవీ వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
స్టార్ క్యాస్ట్‌తో 'పెద్ది'..
ఈ సినిమాలో రామ్ చరణ్ ( ram charan ) సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాకుండా కీలక పాత్రల్లో జగపతిబాబు, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు శర్మ తదితరులు నటిస్తున్నారు. ఈ స్టార్ క్యాస్టింగ్‌నే సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. అలానే ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం మరో ప్రధాన ఆకర్షణ. ఆయన మ్యూజిక్ సినిమాకు ప్రత్యేకమైన ఫీల్ తీసుకువస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

ఫస్ట్ టైమ్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ( ram charan )..
గ్రామీణ వాతావరణంలో, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో 'పెద్ది' తెరకెక్కుతోంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఫస్ట్ షాట్ గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఫుల్ హెయిర్, గడ్డంతో రామ్ చరణ్ ( ram charan ) కనిపించిన రా అండ్ రస్టిక్ లుక్ అభిమానులను పిచ్చెక్కించింది. ముఖ్యంగా ఆయన కొట్టే ఐకానిక్ షాట్, అలాగే "ఏదైనా నేలమీద ఉన్నప్పుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్లీ" అనే ఉత్తరాంధ్ర యాస డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. గత చిత్రం 'గేమ్ ఛేంజర్' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో, ఈ సినిమాపై చరణ్ అభిమానుల్లో భారీ ఆశలు నెలకొన్నాయి. కానీ గత కొద్ది రోజులుగా ఈ సినిమా వాయిదా పడుతుందా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
ఇప్పటికే మార్చి 27న రిలీజ్ అని మేకర్స్ ప్రకటించినప్పటికీ, కొందరు యూజర్లు సినిమా తప్పకుండా పోస్ట్‌పోన్ అవుతుందని ప్రచారం చేస్తున్నారు. మే 1 కొత్త రిలీజ్ డేట్ అంటూ వార్తలు కూడా వైరల్ అయ్యాయి. మార్చి 19న 'ధురంధర్ 2', 'టాక్సిక్' వంటి భారీ సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో, ముఖ్యంగా నార్త్ ఇండియాలో థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అదే కారణంగా యూనిట్‌లో ఒక చిన్న స్థాయి చర్చ జరుగుతున్నా, ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి నిర్ణయం మాత్రం తీసుకోలేదని సమాచారం. మరి రామ్ చరణ్ ( ram charan ) మూవీ విడుదల తేదీపై స్పష్టత రావాలంటే మాత్రం మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications