Ramayana: రావణుడి సింహాసనం,ఆభరణాల ఖర్చు ఎంతయ్యిందో తెలుసా..?

బాలీవుడ్ మరోసారి వార్తల్లో నిలిచింది. భారీ బడ్జెట్ చిత్రం రామాయణ విడుదలతో ఈ చిత్రం టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని ఒక అద్భుత కళాఖండంగా తీర్చిదిద్దేందుకు మూవీ మేకర్స్ అహోరాత్రులు కష్టపడ్డారు. అందుకే ఫలితం కూడా ఆశించిన దానికంటే కూడా బాగొచ్చింది.పాన్ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో కూడా ఈ బిగ్ బడ్జెట్ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ షేక్ చేస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో రావణుడిగా కేజీఎఫ్ స్టార్ యష్ నటించాడు. 100కు110 మార్కులు యష్ తెచ్చుకున్నాడు. ఇంకా చెప్పాలంటే రాముడి క్యారెక్టర్‌ కంటే యష్ చేసిన రావణుడి క్యారెక్టరే ఎక్కువగా ఎలివేట్ అయ్యిందంటూ ఇటు ఫ్యాన్స్ అటు క్రిటిక్స్ ఒప్పుకుంటున్న విషయం. ఇక ఈ రావణాసురుడు కూర్చొన్న సింహాసనం గురించి కచ్చితంగా చెప్పుకోవాల్సిందే. ఇందులో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి.

రామాయణ కోసం 150కిపైగా సెట్లు

రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా నటించిన రామాయణ చిత్రం నవంబర్ 5వ తేదీన విడుదలై బాక్సాఫీస్ వద్ద సునామీ క్రియేట్ చేసింది.నితేష్ తివారీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో యష్ నటనకు మంచి పేరొచ్చింది.రావణుడిగా యష్ వినియోగించిన సింహాసనం కోసం ఫిల్మ్ మేకర్స్ చాలా కష్టపడ్డారు. ఈ చిత్రం కోసం కొన్ని వందల సెట్లు వేసినట్లు రామాయణ మూవీ ఆర్ట్ డైరెక్టర్ రమేశ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.ముంబైలోని ప్రైమ్ ఫోకస్ స్టూడియోలో 2024 ఏప్రిల్ నుంచి ఈ చిత్రం కోసం సెట్స్ వేయడం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.ఈ భారీ బడ్జెట్ చిత్రం కోసం దాదాపుగా 150కి పైగా సెట్స్ వేసినట్లు వెల్లడించారు.తొలి ప్రయత్నంలో వేసిన సెట్ ఏదీ కుదరలేదని... మళ్లీ చాలా చర్చలు, డిజైన్‌లో మార్పులు తర్వాత ఓకే చేయాల్సి వచ్చిందని రమేశ్ చెప్పారు. ఇక డిజైన్స్ అన్నీ ఓకే అయ్యాక సెట్ వేసేందుకు దాదాపుగా మూడు నెలల సమయం పట్టిందని పేర్కొన్నారు.

ramayana-makers-reveal-the-mind-blowing-budget-behind-yashs-ravana-throne-and-jewellery

రావణుడి సింహాసనం సినిమాలో హైలైట్

రామాయణ చిత్రంలో అందరినీ విశేషంగా ఆకట్టుకున్న సన్నివేశం రావణుడు ( యష్) తన సింహాసనంపై కూర్చోవడం. రాక్షసరాజుగా రావణుడిని స్క్రీన్ పై చూపించాలంటే ఆ సింహాసనాన్ని చాలా బాగా తీర్చి దిద్దాలని భావించారట. సాధారణంగా గ్రాఫిక్స్‌తోనే చేయొచ్చు కానీ దానికి రియాలిటీ లుక్ ఇచ్చేందుకు మేకర్స్ కష్టపడ్డారు.ముందుగా బురద మట్టితో కూడిన ఒక మోడల్‌ను తయారు చేసి ఆ పై అచ్చును పోతపోసింది. ఫైబర్ ఉపయోగించి సింహాసనానికి ఒక చక్కటి ఆకృతిని తీసుకొచ్చారు. ఇక దానిపై 24 క్యారెట్ల బంగారు పూత పూసినట్లు రమేష్ వివరించారు. దీంతో సింహాసనం పక్కా బంగారపు సింహాసనంలా కనిపించింది. ఈ చిత్రానికి ఈ సింహాసనమే హైలైట్‌గా నిలిచిందన్నారు. రావణుడి సింహాసనం తయారు చేసేందుకు నాలుగు నెలలు సమయం పట్టిందన్న ఆర్ట్‌డైరెక్టర్... ఇందుకు అయిన ఖర్చు అక్షరాల కోటి రూపాయలని చెప్పారు.

Ramayana Review: రణబీర్ రాముడిగా ప్రశాంతం.. రావణుడిగా యష్ విధ్వంసం! 'రామాయణ ’ ఎలా ఉందంటే?
Ramayana Review: రణబీర్ రాముడిగా ప్రశాంతం.. రావణుడిగా యష్ విధ్వంసం! 'రామాయణ ’ ఎలా ఉందంటే?

రావణుడి ఆభరణాలపై స్పెషల్ ఫోకస్

రావణుడి సింహాసనంతో పాటు ఆయన ధరించే ఆభరణాలపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు డైరెక్టర్. లంకను బంగారంతో నిర్మించారని నమ్ముతారు.అందుకే లంక నగరం ఎంతో వైభంగా కనిపించేది. దీన్నే స్క్రీన్ పై సహజంగా చూపించాలాని భావించినట్లు ఆర్ట్ డైరెక్టర్ రమేష్ పేర్కొన్నారు. ఇక రావణుడు చాలా గంభీరంగా కనిపించేందుకు ఆయన ధరించే ఆభరణాలపై దృష్టి పెట్టినట్లు చెప్పిన రమేష్.. ముందుగా వక్షస్థల కవచం డిజైన్ చేసినట్లు చెప్పారు. ఆ ఛాతీకవచాన్ని హస్తకళాకారులు తయారు చేసినట్లు స్పష్టం చేశారు.దాన్ని పూర్తి చేసేందుకు చాలా సమయం పట్టిందని గుర్తుచేసుకున్న రమేష్..తమ కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక యష్ ఆరుగంటల పాటు దాన్ని ధరించాల్సి వచ్చిందని.. ఆ సమయంలో అసౌకర్యంగా అనిపించకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు. రావణుడు శివభక్తుడు కాబట్టి అలా కనిపించేందుకు ఆభరణాలలో సర్ప ఆకృతులను పొందుపరిచినట్లు చెప్పాడు.

రావణుడు ధరించిన ఆభరణాల కోసం ఇత్తడి, బంగారు పూతను ఉపయోగించినట్లు పేర్కొన్నారు.ఈ ఆభరణాల తయారీకోసం నీలం, నలుపు, ఆకుపచ్చ రంగులతో పాటు బలమైన లోహపు ఛాయలతో కూడిన ముదురు రంగులను ఉపయోగించారు.రావణుడి కోసం 13 రకాల ఆభరణాల డిజైన్లు తయారు చేయగా.. ఒక్కో డిజైన్‌లో 8 నుంచి 10 నగలు పొందుపర్చారు. మొత్తంగా 104 నుంచి 130 నగలను ఒక్క రావణాసురుడి క్యారెక్టర్ కోసమే డిజైన్ చేయగా.. ఆభరణాల మొత్తం బరువు 6 నుంచి 7కేజీలు ఉన్నట్లు ఆర్ట్ డైరెక్టర్ రమేష్ వివరించారు.

మొత్తంగా రూ.4వేల కోట్లతో రెండు భాగాలుగా రామాయణను తెరకెక్కించారు. తొలి భాగం నవంబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సునీమీ సృష్టిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+