రవిబాబు 'రేజర్' టీజర్.. చూడాలంటే ధైర్యం కావాలి..!
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రవిబాబు సినిమాలు అంటేనే సస్పెన్స్ థ్రిల్లర్స్ కు పెట్టింది పేరు. తొలుత నచ్చావులే, నువ్విలా లాంటి లవ్ స్టోరీస్ కు డైరెక్షన్ చేసినా భూమిక తో అనసూయ చిత్రం నుంచి క్రైమ్, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ను ఎంచుకున్నారు. అనసూయ, అమరావతి, అదుగో, ఆవిరి, అవును లాంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. తాజాగా హారర్, క్రైమ్ డోస్ ను మరింత పెంచినట్లు తెలుస్తోంది.

తాజాగా రవిబాబు.. ఓ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వం వహిస్తూ.. అలాగే నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి రేజర్ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పెట్టారు. ఈ గ్లింప్స్ చూడాలంటే ధైర్యం కావాల్సిందే. న్యాయం కోసం రవిబాబు ఇంత క్రూరంగా ఎలా మారారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టైటిల్ గ్లింప్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దాదాపు 45 సెకన్స్ పాటు ఉన్న ఈ గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మరోవైపు 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే ఈ గ్లింప్స్ చూడాలని మేకర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ సైతం ఆకట్టుకుంది. ఓ టీ కప్పులోని నీళ్లలో రక్తంతో చెవిని కట్ చేసి ఉన్న దృశ్యం కనిపిస్తోంది.
రవిబాబు మార్క్ క్రైమ్, థ్రిల్లర్ ఈ గ్లింప్స్ లో కనిపిస్తోంది. ఇక ఈ సినిమాను ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్ నిర్మిస్తోంది. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సమర్పిస్తోంది. ఇక ఈ రేజర్ సినిమాను 2026 వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. ఇక ప్రస్తుతం ఈ టైటిల్ గ్లింప్స్ యూట్యూబ్ లో ఉంది. అయితే ఈ గ్లింప్స్ లో క్రైమ్ అంశాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో వీడియో రెస్టిక్టెడ్ కంటెంట్ లో ఉంది. అలాగే 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే ఈ గ్లింప్స్ చూడాలని మేకర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.
-
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్!












Click it and Unblock the Notifications