స్టార్ హీరోతో మీకు ఏంటి సమస్యలు, ఈ హీరో ఏం చెప్పాడంటే ?, భార్య గురించి, పవర్ స్టార్ తో !
బిగ్ బాస్ కన్నడ సీజన్ 10 ముగిసిన తర్వాత, ఆ షో విజయవంతంగా నిర్వహించిన నటుడు, స్యాండిల్ వుడ్ స్టార్ హీరో, కిచ్చా సుదీప్ సోషల్ మీడియాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధాలు ఇచ్చారు. ఆస్క్ కిచ్చా పేరుతో అభిమానులు ప్రశ్నలు అడగవచ్చని సుదీప్ ఇటీవల చెప్పారు. వేలాది మంది అభిమానులు తమ అభిమాన నటుడు కిచ్చా సుదీప్ కు పలు ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు.
వాటిలో ఎంపిక చేసిన కొన్ని ప్రశ్నలకు హీరో సుదీప్ సమాధానం ఇచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 10 గురించి ఓ మాటలో చెప్పండి అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సుదీప్ స్పందిస్తూ అది మెగా హిట్ అని చెప్పాడు. ఈసారి బిగ్ బాస్ ఊహించిన దానికంటే ఎక్కువ పాపులర్ అయింది. ఈ విషయంలో కిచ్చా సుదీప్ అభిమానులు సంతోషంగా ఉన్నారు. కాంతార ఫేమ్ రక్షిత్ శెట్టి గురించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సుదీప్ స్పందిస్తూ అతను ఓ డ్రీమర్ అని చెప్పాడు.

అలాగే మ్యాక్స్ సినిమా షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ 25 రోజుల్లో పూర్తి చేయొచ్చ అంటూ హీరో సుదీప్ సమాధానం ఇచ్చారు. ఒక అభిమాని అయితే స్యాండిల్ వుడ్ పవర్ స్టార్, దివంగత డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ గురించి కొన్ని మాటలు చెప్పమని అడిగాడు. పునీత్ రాజ్ కుమార్ ఒక పుస్తకం లాంటి వాడు. ఆయన గురించి కొన్ని పదాలలో ఎలా వ్రాయాలో, ఎలా మాట్లాడాలో ఎవ్వరూ చెప్పలేరని హీరో సుదీప్ సమాధానం ఇచ్చారు.
మా వదిన ప్రియా సుదీప్ (హీరో సుదీప్ భార్య) గురించి చెప్పండి అంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు హీరో సుదీప్ సమాధానమిస్తూ ఆమె తనకు చాలా అందమైన శక్తి అని హీరో సుదీప్ రొమాంటిక్ గా సమాధానం ఇచ్చారు. సుదీప్ తదుపరి చిత్రం కేకే, గతంలో ప్రకటించిన కన్వర్ లాల్ సినిమాల విషయాల గురించి అభిమానులు అడిగిన ప్రశ్నలసు సమాధానం ఇచ్చిన సుదీప్ ఆ సినిమాల గురించి తనకు తెలీదని తెలివిగా సమాధానం ఇచ్చారు. అలాగే కొందరు అభిమానులు అడిగిన కొన్ని విషయాలు కూడా తనకు తెలియదని సుదీప్ సమాధానమిచ్చాడు.

సుదీప్- చాలెంజింగ్ స్టార్, డీ బాస్ దర్శన్ మధ్య సమస్య ఏంటి? అని కొందరు అభిమానులు హీరో సుదీప్ ను సూటిగా ప్రశ్నించారు. హీరో సుదీప్, చాలెంజింగ్ స్టార్ దర్శన్ కన్నడ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్లు అనే విషయం అందరికీ తెలిసిందే. వారిద్దరికీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మొదట్లో స్నేహితులుగా ఉన్న సుదీప్, దర్శన్ ఆ తర్వాత దూరం అయ్యారు. దీంతో ఇప్పుడు వీరిద్దరి కలయిక కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మీ మధ్య సమస్య ఏమిటి అని ఓ అభిమాని సుదీప్ ను అడిగాడు.
మీకు దర్శన్‌కి మధ్య ఉన్న సమస్య ఎప్పుడు పరిష్కరిస్తారం అవుతుందని, ఇంకా ఎంత సమయం పడుతుందని అభిమానులు హీరో సుదీప్ ను ప్రశ్నించారు. దీనికి సుదీప్ బదులిస్తూ మా మధ్య సమస్య ఏంటి అనే విషయం గురించి తాను, దర్శన్ వెతుకుతూనే ఉన్నామని, మా మధ్య సమస్య ఏమిటి అనే విషయం ఇద్దరికి అంతుచిక్కడం లేదని సుదీప్ చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు. అయితే హీరో దర్శన్ ఎప్పుడు సంతోషంగా, ఉన్నత స్థాయిలో ఉండాలని, ఆయన బాగుగురించి ఆలోంచించేవారితో తాను ఒక్కడు అని హీరో సుదీప్ చెప్పాడు. హీరో దర్శన్ శ్రేయస్సును ఎప్పుడూ కోరుకుంటానని కిచ్చా సుదీప్ చెప్పాడు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications