అందరూ చూస్తుండగానే అవి వేసుకోమనేవారు: స్టార్ హీరోయిన్
టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. ఆపై బాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినీ ఇండస్ట్రీలోని చీకటి కోణాలను బయటపెట్టారు. ముఖ్యంగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అసౌకర్యంగా అనిపించేది..
గ్లామర్ సీన్లు, పాటల చిత్రీకరణ సమయంలో తనను ప్యాడెడ్ బ్రాలు ధరించమని చిత్ర యూనిట్ సభ్యులు ఒత్తిడి చేసేవారని తాప్సీ వెల్లడించారు. షూటింగ్ సెట్స్‌లో అందరూ చూస్తుండగా.. తనకు ఇష్టం లేకపోయినా అలాంటి దుస్తులు ధరించాల్సి రావడం ఎంతో అసౌకర్యంగా ఉండేదని ఆమె తెలిపారు. అది కేవలం శారీరక ఇబ్బంది మాత్రమే కాదని.. మానసికంగా కూడా ఎంతో అవమానకరంగా అనిపించేదని ఆమె తన గోడు వెళ్లబోసుకున్నారు.

గ్లామర్ కోసం ఒత్తిడి
సాధారణంగా సినిమాల్లో హీరోయిన్లను మరింత గ్లామరస్‌గా చూపించే క్రమంలో డైరెక్టర్లు లేదా కాస్ట్యూమ్ డిజైనర్లు ఇలాంటి నిబంధనలు విధిస్తుంటారు. అయితే నటీనటుల వ్యక్తిగత సౌకర్యాన్ని పక్కన పెట్టి ఇలాంటి వాటి కోసం ఒత్తిడి చేయడం సరైనది కాదని తాప్సీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్నత స్థానంలో ఉన్న ఆమె.. గతంలో తను అనుభవించిన ఈ 'కాస్ట్యూమ్ కష్టాలను' గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.
ప్యాడెడ్ బ్రాలు ధరించమనేవారు: తాప్సీ
— ChotaNews App (@ChotaNewsApp) February 22, 2026
దక్షిణాది చిత్ర పరిశ్రమలో గ్లామర్ సీన్స్, పాటల కోసం ప్యాడెడ్ బ్రాలు ధరించమని ఒత్తిడి చేసేవారని నటి తాప్సీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. షూటింగ్ సెట్స్‌లో అందరూ చూస్తుండగా అవి ధరించడం ఎంతో అసౌకర్యంగా, అవమానకరంగా అనిపించేదని ఆమె ఆవేదన వ్యక్తం… pic.twitter.com/spJsKEiMUp
దూసుకెళ్తున్న'అస్సి'
కెరీర్ పరంగా తాప్సీ ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం'అస్సి'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో తాప్సి తన వైవిధ్యమైన నటనతో అభిమానుల మెప్పు పొందారు. ఒకవైపు తన సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. పరిశ్రమలో జరిగే తప్పులను ఎత్తిచూపడంలో తాప్సీ ఎప్పుడూ ముందుంటారని ఈ వ్యాఖ్యలతో మరోసారి నిరూపితమైంది.
-
ఒక్క వెబ్ సిరీస్ తోనే పిచ్చెక్కించే షాక్ ఇచ్చిన బ్యూటీ.. -
బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి.. కాబోయే అల్లుడు అతనే ?? -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
పెళ్లయిన నెల రోజులకే రష్మిక గుడ్ న్యూస్..? ముగ్గురం అయ్యామంటూ పోస్ట్ వైరల్.. -
'బైకర్' మూవీ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్.. 2 నెలల్లో 2 హిట్లు నీకే సాధ్యం అన్నా..! -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ ! -
నటి హేమ పబ్ వీడియో వైరల్.. నేనెప్పుడూ తప్పు చేయనంటూ..! -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
కొత్త `రామాయణం`- ప్రభాస్ మూవీపై భారీ ట్రోల్స్












Click it and Unblock the Notifications