Vishal : హీరో విశాల్ షాకింగ్-మార్క్ ఆంటోనీ మూవీ క్లియరెన్స్ కు 6.5 లక్షల లంచం-ఆధారాలతో ట్వీట్..

తమిళ హీరో, నిర్మాత విశాల్ ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు. తన తాజా చిత్రం మార్క్ ఆంటోనీ హిందీ వెర్షన్ కు సర్టిఫికెట్ కోసం సెన్సార్ బోర్డుకు రూ.6.5 లక్షల లంచం ఇవ్వాల్సి వచ్చిందని ఆరోపించారు. అంతే కాదు దానికి సంబంధించిన ఆధారాల్ని కూడా ఎక్స్ లో బయటపెట్టారు. రెండు అకౌంట్లకు ఈ మొత్తం బదిలీ చేసినట్లు విశాల్ చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో సీబీఎఫ్సీపై చర్యలు తీసుకోవాలని విశాల్ ప్రధాని మోడీని కోరారు.

tamil actor vishal sensational allegations on cbfc, paid 6.5 lakhs for Mark Antony movie clearance

"అవినీతిని వెండితెరపై చూపిస్తున్నారు. కానీ నిజ జీవితంలో కాదు. జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో. CBFC ముంబై ఆఫీసులో ఇంకా దారుణం జరుగుతోంది. నా సినిమా #MarkAntonyHindi వెర్షన్ కోసం 6.5 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. 2 లావాదేవీలు. స్క్రీనింగ్ కోసం 3 లక్షలు, సర్టిఫికేట్ కోసం 3.5 లక్షలు. నా కెరీర్‌లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు" అంటూ హీరో విశాల్ ట్వీట్ లో పేర్కొన్నారు.

"ఈ రోజు సినిమా విడుదలైనప్పటి నుండి సంబంధిత మధ్యవర్తి మేనగాకు చాలా ఎక్కువ డబ్బు చెల్లించడం తప్ప వేరే మార్గం లేదు. ఈ విషయాన్ని గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి మరియు నా గౌరవప్రదమైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకువెళుతున్నాను. ఇలా చేయడం నా కోసం కాదు కాబోయే నిర్మాతల కోసం. నేను కష్టపడి సంపాదించిన డబ్బు అవినీతికి పోయింది ??? అవకాశమే లేదు. అందరూ వినడానికి సాక్ష్యం డౌన్. సత్యం ఎప్పటిలాగే గెలుస్తుందని ఆశిస్తున్నాను" అంటూ ట్వీట్ లో విశాల్ తెలిపారు.

దీంతో విశాల్ సీబీఎఫ్సీని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారన్న దానిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. గతంలోనూ పలు చిత్రాలకు లంచాలు ఇచ్చి క్లియరెన్స్ లు తెచ్చుకున్నట్లు పలువురు నిర్మాతలు ఆరోపిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా విశాల్ కేవలం ఆరున్నర లక్షలు ఇచ్చిన అంశాన్ని ఇలా దేశవ్యాప్తంగా ఎందుకు చర్చలు పెట్టారనే చర్చ జరుగుతోంది. అయితే పక్కా ఆధారాలు ఉండటంతోనే విశాల్ ఇలా ఈ లంచం అంశాన్ని బయటపెట్టినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+