వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fact check : రాష్ట్రపతి వేతనానికి ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు ఉంటుందా...?

|
Google Oneindia TeluguNews

ఇటీవల ఉత్తరప్రదేశ్ పర్యటనలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తన వేతనంపై చేసిన వ్యాఖ్యలపై వివాదం ముసురుకున్న సంగతి తెలిసిందే. తనకు నెలకు రూ.5 లక్షలు వేతనం వస్తున్నా... అందులో రూ.2.75లక్షలు పన్నులకే పోతుందని ఆయన వ్యాఖ్యానించారు. తనకంటే అధికారులు,టీచర్లే ఎక్కువగా సంపాదిస్తారని అన్నారు. రాంనాథ్ కోవింద్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

భారత రాష్ట్రపతికి ఇచ్చే వేతనానికి పన్ను మినహాయింపు ఉంటుందని చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నేతలు సైతం ఇదే విషయాన్ని చెప్పారు. భారత రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తికి ఈ విషయం తెలియకపోవడమేంటని నీరజ్ భాటియా లాంటి కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. అయితే ఎవరి వాదన సరైనది... రాష్ట్రపతి వేతనానికి పన్ను మినహాయింపు ఉంటుందా...?

fact check is it true president of india exempted from income tax

రాజ్యాంగ ప్రకారం... రాష్ట్రపతి వేతనం,ఇతరత్రా అలవెన్సులు,బెనిఫిట్స్ వివరాలన్నీ రాష్ట్రపతి వేతన,పెన్షన్ యాక్ట్ 1951లో పొందుపరచబడి ఉంటాయి. పార్లమెంటుకు ఈ చట్టాన్ని సవరించే అధికారం ఉంటుంది. 2018లో చేసిన సవరణల ఫలితంగా రాష్ట్రపతి వేతనం రూ.5లక్షలకు పెరిగింది. అంతకుముందు వరకు రాష్ట్రపతి వేతనం రూ1.15లక్షలుగా ఉండేది. వేతనంతో పాటు నివాసం,మెడికల్,ఇతరత్రా సదుపాయాలు కూడా రాష్ట్రపతికి అందుతాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం రాజ్యాంగం లేదా రాష్ట్రపతి వేతన,పెన్షన్ యాక్ట్ రాష్ట్రపతి వేతనాన్ని ట్యాక్స్ నుంచి మినహాయించలేదు. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం 1961లోని సెక్షన్ 10లో రాష్ట్రపతి ఆదాయానికి పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ఎక్కడా ప్రస్తావించలేదు. ఇప్పుడున్న చట్ట ప్రకారం ప్రతీ నెలా రూ.1.7లక్షలు చొప్పున ఏటా రూ.20లక్షలు వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.కాబట్టి రాష్ట్రపతి వేతనానికి ట్యాక్స్ ఉండదన్న ప్రచారంలో నిజం లేదన్న విషయాన్ని గమనించాలి.

Fact Check

వాదన

రాష్ట్రపతి వేతన,పెన్షన్ చట్టం 1951 ప్రకారం రాష్ట్రపతి వేతనానికి ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది.

వాస్తవం

రాష్ట్రపతి వేతన,పెన్షన్ చట్టం 1951లో రాష్ట్రపతి వేతన మినహాయింపుకి సంబంధించిన ప్రస్తావనేదీ లేదు.

రేటింగ్

False
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
English summary
President Ram Nath Kovind, on June 27, 2021, said his salary is Rs 5 lakh a month and of it, Rs 2.75 lakh go into taxes. The President made this claim while urging people to pay taxes regularly for the sake of development in the country, at an event organised at the Jhinjhak railway station while on a three-day visit to Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X