జూనియర్... జూనియర్ ... నీ దారేంటి?

Jr Ntr
జూనియర్ మొన్న బెజవాడలో ఇచ్చిన కౌంటర్‌కి చంద్రబాబు, బాలయ్య, చినబాబు తట్టుకోలేక దాడి మొదలు పెట్టారు! ఇప్పటిదాకా అతను దారికొస్తాడని ఆశగా చూసారు! ఎన్టీవి లో పిల్ల కాకి అని ఎటాక్ మొదులెట్టారు! దీన్లో ఆశ్చర్యం లేదు, చంద్రబాబు జీవితమే నిలువుటద్దం! అతని 'వాడుకో వదిలేసుకో పాలసీ' చిన్నప్పటి నుండి ఆచరించి ఆచరించి ఆరితేరాడు! ఇదే పిల్ల కాకితో 2009 ఎన్నికలలో ఆసుపత్రిలో వున్నప్పుడు కూడా వీడియోలు తీసి మరీ ప్రచారం చేయించుకున్నాడు.

పొమ్మనలేక పొగ పెడుతున్నాడు. ఎక్కడో తన మానాన తాను బతుకుతున్నజూనియర్ అక్కున చేర్చుకొన్నట్లే చేర్చుకొని, కుటుంబంలో చేర్చుకున్నట్లే చేర్చుకొని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతున్నారు. పార్టీలు, రాజకీయాలు వదిలేస్తే ఒక మనిషి మీద ఎందుకంత కక్షో, లేక ముందు ముందు అడ్డు వస్తాడని ఏమన్నా ముందు జాగ్రత్తో మరి? సినిమా హీరోగా దుమ్ము లేపేవరకు జూనియర్‌ని గానీ, అతని తల్లిని గానీ పట్టించుకున్న పాపాన పోలేదు నందమూరి, నారా కుటుంబాలు! వీడు తొత్తులాగా ఉండడు అని తెలుసుకున్న మరుక్షణమే జూనియర్ ని తొక్కే వ్యూహం బయటకి తీసారు!

జూనియర్ ముందున్నవి రెండు మార్గాలు!

1. చంద్రబాబన్నా, మారిన తెలుగుదేశం పార్టీ లక్ష్యాలన్నావిసిగి వేసారి పోయిన తెలుగుదేశం అసలు సిసలయిన కార్యకర్తలని, స్థానిక నాయకులని, కొంత మంది సీనియర్ నాయకులని కూడగట్టుకుని అసలు సిసలు సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం లాగా నిర్వహించడం. నాకు తెలిసి ఇది చాలా కష్ట సాధ్యం! తెలుగుదేశం వోట్ షేర్ చాలా తగ్గి ఉన్న ఈ స్థితిలో చాలా కష్టం!

2. నేరుగా జై జగన్ అనడం! తనకున్న అభిమానుల అండదండలతో జగన్ దగ్గర మంచి స్థానాన్ని దక్కించుకుంటాడు! జూనియర్ మద్దతుని జగన్ కూడా తక్కువగా అంచనా వెయ్యడు! సరే కులం విషయానికొస్తే, మరి తన కుల పెద్దలే కదా పొగ పెడుతున్నది ఇప్పుడు జూనియర్‌కి? వాళ్ళ కోసం తను ఎందుకు బలి కావాలి? ఎంతో కొంత అభిమానులు చేజారిపోతారు తన వైఎస్సార్ కాంగ్రెస్ చేరిక వల్ల! కాని ఇక్కడే ఒక మేజిక్ ఉంది, వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులందరికీ జునియరే హీరో అవుతాడు! అంటే ప్రజా జీవితంలో జగన్ హీరో అయితే, సినిమా జీవితంలో జూనియర్ హీరో అవుతాడు! పొయ్యేది తక్కువ, వచ్చేది చాలా ఎక్కువ జూనియర్కి!

జూనియర్ నిజంగా నీకు ఖలేజా, దమ్ము ఉంటే రేపే నువ్వు జగన్‌ని కలిసి మనస్పూర్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి, జగన్ కి అండగా నిలువు. రక్షో రక్షిత అంటే ఇదే జూనియర్!

గురువారెడ్డి, అట్లాంటా

(గురువారెడ్డి వ్యక్తం చేసిన అభిప్రాయంలతో వన్ ఇండియా తెలుగుకు ఏ విధమైన సంబంధం లేదు. ఇవి వ్యాసరచయిత అభిప్రాయలే గానీ మా అభిప్రాయాలు కావని పాఠకులు గుర్తించగలరు. రచయిత అభిప్రాయాలతో విభేదించేవారు తమ అభిప్రాయాలను వ్యాసరూపంలో పంపిస్తే ప్రచురిస్తాం. చిన్నపాటి అభిప్రాయాలైతే ఎలాగూ కామెంట్స్‌లో పోస్టు చేస్తాం - ఎడిటర్)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+