• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లోకేష్ బాబుకి బహిరంగ లేఖ!

By Pratap
|

Nara Lokesh
లోకేష్ బాబు, మీరు ప్రజల్లోకి పోయి చెప్పకుండా, ట్విట్టర్లో మొన్న "వైయస్ జగన్మోహన్ రెడ్డి నుండి ఆ పార్టీకి చెందిన నాయకులు స్ఫూర్తి పొందుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి = ఎటిఎం దొంగతనాలు, నకిలీ నోట్లు, దొంగ బంగారం. పార్టీ అధ్యక్షుడిని చూసి వారు కూడా స్ఫూర్తి పొందినట్లున్నారు." అని పోస్ట్ చేసారు.

మీరంటే ఏదో అనుకున్నాను గాని చాలా తేడా మనిషిలా ఉన్నారే!? మీ తండ్రేమో తన మీద ఉన్న ఆరోపణలని ప్రజలు గుర్తించరన్నట్టు సుద్దులు చెప్తాడేంటి అని ప్రజలు ఆశ్చర్యపోతుంటే, మీరేమో ఆయన్ని కూడా మించి పోయారు! మేము నీతిమంతులం ఎదుటోల్లు తప్పుడోల్లు అని ప్రచారం చేసి రెండు సార్లు ఓడిపోయి, ఇప్పటిదాకా కోలుకోకుండా 2009 నుండి జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో ఓడిపోవడమే కాకుండా సగానికి పైగా స్తానాల్లో డిపాజిట్లు కూడా పోగుట్టుకుంటున్నారు కాని ఇంత వరకు ఎందుకిలా అనే అలోచన చేయడంలేదు మీ తండ్రిగారును మీరున్ను. ఎవరో ఒక పెద్ద రాజు గారి పుణ్యాన స్టాంఫోర్డ్ లో చదివితే మాత్రం అసలు చిన్నపాటి అలోఅచన కూడా చెయ్యడం చేతకపోతే అంతా వ్యర్ధం అని మీరు బాగా నిరూపిస్తున్నారు! అన్ని రకాల మనుషులు రాజకీయాల్లో ఉంటారనే సాధారణ విషయం తెలేని మీకు చదువెందుకు? మోసగాడు, నేరస్తుడు అని తెలిసిన తరవాత పార్టీలో ఉండనిస్తే, లేక మల్లీ చేర్చుకుంటే తప్పు! చదివినోడికంటే చాకలోడు మేలనేది ఇందుకేనేమో? తెలుగుదేశంలో ఉన్నంత మంది మోసగాల్లు, నేరస్తులు ఇంకే పార్టీలో లేరనిను, వారి పార్టీ అద్యక్షుడే (మీ స్వయాన తండ్రిగారు) అందరికంటే మోసగాడని ఆ పార్టీ వ్యవస్తాపక అద్యక్షుడే (మీ స్వయాన తాతగారు) అనుకుంటూ మరణించిన సంగతి ఈ మీకు స్టాంఫర్డులో చెప్పలేదేమో గురువులు!

ఉదాహరణకి పరిటాల రవి (పెద్దగా చెప్పుకోవాల్సినదేమి లేదు, రాష్ట్రం మొత్తానికి తెలుసు వీరి అహింసా సిద్ధాంతం గురించి, ఆయన కుమారుడు, తెలుగుదేశం యువనేత పరిటాల శ్రీరాం (మొన్న మొన్న హత్య కేసులో నిందితుడు), క్రిష్ణ యాదవ్ (స్టాంపుల కుంభకోణంలో జైలుకెల్లి వచ్చినవాడిని మళ్లీ మీ తండ్రి చంద్రబాబే పార్టీలో చేర్చుకున్నారు), కోడెల శివ ప్రసాద్ (బాంబుల కేసులో ఎలా బయటపడ్డ సంగతి అందరికీ తెలుసు), దొంగ లాటరీ కోలా కృష్ణ మోహన్, కృషి బ్యాంకుని ఎత్తేయించిన వెంకటేశ్వర రావు, దొంగ నోట్ల రామ కృష్ణ గౌడ్తో మీ తండ్రికున్న అనుబంధం, సుమన్ రాథోడ్ (భూ కబ్జా కేసు, దొంగ కుల సర్టిఫికేట్ కేసు), ఎన్ కౌటర్ పింగళి దశరద్ రామ్ హత్య వంగవీటి రంగా హత్య విషయాల్లోనూ తెలుగుదేశం పార్టీపై ఆరోపణలున్నాయి. ఇలా ఎన్నో ఉన్నాయి లోకేషూ. ఇంకా కావాలంటే నాకు ఒక వారం టైం ఇవ్వు అన్నీ చెప్తా!! అసలు విషయం మర్చాను. ఎన్నికల్లో ప్రజల్లో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ ని పొట్టనపెట్టుకున్న బాబు మీ తండ్రి చంద్రబాబే!

ఎన్టీఆర్ ని చెప్పులతో కొట్టించి, వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కుని ఎన్టీఆర్ మరణానికి కారణం అయి అదే ఎన్టీఆర్ పేరు మీద ఓట్లు అడుక్కుంటున్న బాబు మీ బాబు చంద్రబాబే! రెండెకరాల నుండి వేల కోట్ల ఆస్తులు, బినామీల దగ్గరున్న లక్షల కోట్ల ఆస్తులు అక్రమంగా సంపాదించిన బాబు కూడా మీ బాబు చంద్రబాబే లోకేషూ! చదివానని డిగ్రీలు చూపించడం కాదు కొంచెం అన్నా అలోఅచన చెయ్యాలి! ఎదుటోల్ల పై ఒక వేలు చూపిస్తే మిగిలిన నాలుగు వేల్లు మనల్నే చూయిస్తాయని తెలుసుకుంటే తరవాత్తరవాత ఉపయోగపడ్తుందేమో మీకు? ఇది ఏ గురువు మీకు చెప్పుండరు, కాని తప్పక తెలుసుకోవాల్సిన విషయం! మీ ప్రవర్తన మీద కూడా చాలా కధలున్నాయి, కాని రుజువులు లేకుండా ఈ బహిరంగ లేఖలో ప్రస్తావించడం సరి కాదు! ముందు మన మలినాన్ని కడుక్కుని వేరే వాల్ల మీద ఆరోపణలు చేస్తే మనకి విశ్వసనీయత వస్తుంది. మీ తండ్రిగారికి ఇప్పటివరకు అర్ధం కానిది మీ ఉన్నత చదువుల వల్ల మీకన్నా అర్ధమువద్దని నా చిన్ని ఆశ! మీరెప్పుడు మారుతారు బాబు లోకేష్ బాబూ?

గురవా రెడ్డి, అట్లాంటా (అమెరికా సంయుక్త రాష్ట్రాలు)

(ఈ వ్యాసంలో వ్యక్తమైన అభిప్రాయాలతో వన్ ఇండియా తెలుగుకు ఏ విధమైన సంబంధం లేదు. అవి కేవలం రచయిత అభిప్రాయాలు మాత్రమే. రచయిత అభిప్రాయాలపై ఎవరైనా స్వేచ్ఛగా స్పందించవచ్చు. మీ అభిప్రాయాలను ఈ మెయిల్ అడ్రస్‌కు పంపించండి. pratap.reddy@oneindia.co.in)

English summary
NRI Guruva Reddy has expressed his opinion on Telugudesam party president Nara Chandrababu Naidu's son Nara Lokesh opinions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X