సెక్స్ వర్కర్ గా మారిన అథ్లెట్

26 ఏళ్ల నిశా షెట్టి 1998లో అస్సాం నుంచి జాతీయ క్రీడల్లో పాల్గొంది. ఉపాధి లేకపోవడంతో, 2007లో భర్త మరణించడంతో ఆమె సెక్స్ వర్కర్ గా మారింది. తాను, తన ఐదేళ్ల పాప బతకడానికి తాను ఈ పనిలోకి దిగినట్లు ఆమె పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఆమెకు రాయపూర్ కోర్టు పదివేల రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ మొత్తం ఆమె వద్ద లేదు. దీంతో ఆమె జైలులోనే మగ్గాల్సి వస్తోంది. స్తానిక క్రీడాధికారులు ఆమె పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. కనీసం బెయిల్ ద్వారా విడుదల కావడానకైనా సహకరిస్తామని ఛత్తీస్ గడ్ వాలీబాల్ ఆసోసియేషన్ కార్యదర్శి మొహమ్మద్ అక్రం అన్నారు. కానీ అది జరగలేదు.
పూణేలో జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ లో ఆరేళ్ల క్రితం నిషా వెండి పతకం సాధించింది. ఆ ఏడాదే ఆమె సునీల్ షెట్టిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె కుటుంబం ఈ పెళ్లిని వ్యతిరేకించింది. సునీల్ అస్పాం తరఫున ఫుట్ బాల్ కు జాతీయ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించాడు. 2004లో కూతురు పుట్టిన తర్వాత సునీల్ తీవ్ర నిస్పృహకు గురై తాగుడు అలవాటు పడ్డాడని, ప్రభుత్వోద్యోగాన్ని నిర్లక్ష్యం చేశాడని నిషా చెప్పినట్లు పోలీసు వర్గాలు ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో చెప్పాయి. మూత్రపిండాలు దెబ్బ తినడంతో సునీల్ 2007 ఫిబ్రవరిలో మరణించాడు. దాంతో నిషా జీవితం వీధిన పడింది. స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం దొరకలేదు. ఉద్యోగాన్వేషణలో ఆమె ఏడాది క్రితం ముంబై వెళ్లి, ఏమీ దొరక్క సెక్స్ వర్కర్ గా మారిపోయింది. నిషా, మరో ఇద్దరు స్త్రీలు 50 వేల రూపాయలకు ముగ్గురు వ్యాపారవేత్తలతో గడపడానికి అంగీకరించారు. ఆ వ్యాపారవేత్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications