‘బ్రా’ ఎంపిక సరిలేకుంటే రొమ్ము కేన్సరే!

తీరా ఇంటికి వచ్చిన తర్వాత వేసి చూసుకుంటే అది వదులుగానో, బిగుతుగానో ఉండటాన్ని గ్రహించి దానిని బయటకు చెప్పుకోలేక అలానే వేసేసుకుంటూంటారు. బ్రా అంటే కేవలం అందం కోసమేనని అందరూ అనుకుంటారు. కానీ, అది ఆరోగ్యానికి కూడా పలు రకాలుగా మేలు చేస్తుందన్న విషయాన్ని వారు విస్మరిస్తున్నారు. సరైన సైజు బ్రాలు వాడితే మెడనొప్పి, వెన్నునొప్పి, తలనొప్పి వంటి వాటికి దూరంగా ఉండవచ్చు. అంతేకాదు, బ్రా ఎంపిక లొపాలే రొమ్ము కేన్సర్ కు పలు సందర్భాలలో కారణమవుతుందని కూడా నిపుణులు అంటున్నారు.
మీరు ఎన్నుకొనే బ్రా కొంచెం కూడా స్తన భాగం బయటకు రాకుండా ఉండేవిధంగా ఉండాలి. కప్ సైజ్ బ్రాను కొనుగోలు చేయడంలో ఉన్న ఆసక్తిని, స్ట్రాప్ ఎంపికలోనూ చూపాలి. వెడల్పు తక్కువగా ఉండే స్ట్రాప్ లు వక్షోజాలను సరైన రీతిలో ఉంచలేవు. అలాగే ముందువైపు హుక్కులు ఉండే బ్రాల కంటే కూడా వెనుక హుక్కులు శుండే బ్రా లు బాగా పట్టి ఉంచుతాయి. బ్రాలను వాడకపోతే వక్షోజాలు వదులుగా, జారిపోయినట్లగా ఉంటాయి. పాలు పట్టే పిల్లల తల్లులైతే డబుల్ కప్ టైప్ బ్రా తొడుక్కోవడం ఎంతైనా అవసరం. వ్యాయామం చేసేటపుడు కూడా బ్రా ను ఖచ్చితంగా వేసుకోవాలి. ఎటువంటి కాలంలోనైనా కాటన్ బ్రాలు తొడుక్కోవడం మంచిది.
బ్రాల ఎంపిక ఎలా వుండాలి ?
యువతులు ఎల్లప్పుడూ ఐదు రకాల బ్రాలు అందుబాటులో ఉండేట్లు చూసుకోవాలి. అన్ని రకాల షేపులకు సరిపోయే ఫుల్ కప్ సైజు బ్రాలు, మెడవరకూ ఉండే జాకెట్ తొడుక్కునేటపుడు దానికి తగిన బ్రా, పాలు ఎక్కువగా పట్టే సమయంలో కూడా తొడుక్కునేందుకు వీలైన బ్రా. నైటీ వంటి దుస్తులు ధరించినపుడు అందుకు సరైన విధంగా ఉండే ఈజీ బ్రా, చుడీదార్, మిడ్డీ వంటి దుస్తులను ధరించినపుడు వాటికి అననువుగా ఉండే బ్రా. ఇటువంటి రకాలైన బ్రాలు ఒకే రంగులో కాకుండా అనేక రంగుల్లో ఉండటం కూడా అవసరం.












Click it and Unblock the Notifications