లిబియన్ల పాలిట హీరో, విలన్ గడాఫీ

Mummar Gaddafi
ముమ్మార్ గడాఫీ - లిబియా ప్రజలకు ఒకప్పుడు హీరో. ఇప్పుడు అదే ప్రజల చేతులో దారుణంగా చంపబడ్డాడు. అధికారంలోకి వచ్చిన ప్రారంభంలో హీరోగా చూసిన ప్రజలే అతను చనిపోతే సంబరాలు చేసుకున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం 1969 సెప్టెంబర్ ఒకటో తేదీన లిబియాలోని రాచరికాన్ని కూలదోసి గడాఫీ గద్దెనెక్కారు. బ్రిటన్‌లో సైనిక శిక్షణ పూర్తి చేసుకొని వచ్చి రాచరిక వ్యవస్థపై తిరుగుబాటు చేశాడు. గడాఫీ అప్పుడు ఎలాంటి రక్తపాతం లేకుండా లిబియాను తన హస్తగతం చేసుకున్నాడు. నాటి నుండి నేటి వరకు అక్కడ తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. అయితే రక్తపాతం లేకుండా హస్తగతం చేసుకున్న లిబియాను ఆ తర్వాత రక్తపుటేరులలో ముంచాడు. గడాఫీకి ఇద్దరు భార్యలు, ఏడుగురు కొడుకులు, ఒక కూతురు. ప్రతి విషయంలోనూ గడాఫీ వెరైటీగా ఉండేవాడు. వస్త్రధారణ నెమలి పింఛం మాదిరి ఉంటుంది. తన అంగ రక్షకులుగా మహిళలను ఎంచుకుంటాడు. ఆయన సొంత పట్టణం సిర్తేలో కుటుంబ సభ్యులు ఉంటారు. అధికారం చేతిలోకొచ్చాక జల్సాలు చేయటం ప్రారంభించాడు. ప్రపంచంలోనే మొదటి పది భారీ చమురు దేశాలలో లిబియా ఉంటుంది. చమురు బావులనన్నింటినీ తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల చేతిలోనే ఉంచేవాడు. దాని ద్వారా వచ్చే ఆదాయంతో విలాసాలు చేసేవాడు.

అంతకంతకు ఇది పెరగడంతో ప్రజల్లో గడాఫీ, ఆయన కుటుంబం పట్ల అగ్రహం వ్యక్తమవడం ప్రారంభించింది. గడాఫీ రాజ్యాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత అంతకుముందు రాజ్యాంగాన్ని రద్దు చేసి తన ఆలోచనలతో కూడిన రాజ్యాంగాన్ని ప్రజలపై రుద్దాడు. తనకు అనుగుణంగా కొత్త కొత్త విధానాలు తీసుకు వచ్చేవాడు. రాజకీయ పార్టీలు పెట్టడాన్ని నిషేధించాడు. అలాంటి ప్రయత్నాలు చేసిన వారిని కఠినంగా శిక్షించేవాడు. అంతా అతను చెప్పినట్లు వినాల్సిందే. ఎవరైనా ఎదురు తిరిగితే వారిని కఠినంగా అణిచి వేసే వాడు. ఒక విధంగా లిబియాకు గడాఫీయే ఆధ్యాత్మిక గురువు, దిశా నిర్దేశకుడు. తాను చేస్తున్నది ప్రజాస్వామ్యమని నమ్మేవాడు. అదే అతని నియంతృత్వానికి దారి తీసింది. గడాఫీ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న 1969లోనే అతనికి వ్యతిరేకంగా వచ్చిన తిరుగుబాటును అణిచి వేశాడు. అధికారం హస్తగతమైన తర్వాత అమెరికా, బ్రిటిషన్ సైనిక స్థావలాన్ని మూసేయించి వారి ఆగ్రహానికి గురయ్యాడు. మరిన్ని రాబడులు లిబియాకు పంచితే తప్ప మీకంపెనీల్ని చమురు క్షేత్రాల నుంచి తరిమేస్తానని హెచ్చరించడంతో ఆ దేశాలు మరింత ఎక్కువ వాటా ఇవ్వడానికి ఒప్పుకున్నాయి.

చమురు రంగంపై గడాఫీ పట్టు అమెరికా తదితర పాశ్చాత్య దేశాలకు కంటగింపుగా మారింది. మరోవైపు దేశంలో అతనిని నియంతృత్వంపై ప్రజలు అసంతృప్తికి లోనవుతున్నారు. ఆఫ్రికాను తన నియంత్రణలోకి తెచ్చుకోవాలని గడాఫీ కలలు కనేవాడు. అయితే ఆయన నియంతృత్వ పోకడలు నచ్చని ఐక్య రాజ్య సమితి(ఐకాస), పలు దేశాలు లిబియాపై ఆంక్షలు విధించాయి. ఆ తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో ఐకాస లిబియాపై ఆంక్షలు ఎత్తి వేసింది. అయితే అమెరికా ఆధిపత్యానికి మొదట దాసోహమన్న గడాఫీ ఆ తర్వాత అమెరికాను వణికించాడు. 1990లో గల్ఫ్ ప్రాంతంలో అమెరికా జోక్యాన్ని ఖండించాడు. 2009లో ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ ఇరాక్‌లో అమెరికా తలదూర్చడాన్ని అలాగే జార్జి బుష్‌ యుద్ధ బీభత్సం సృష్టించాడని ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని బహిరంగంగా డిమాండ్ చేశాడు. 1986లో చాద్ ఆక్రమించాలని గడాఫీ చూశాడు. ఇందులో తన పెంపుడు కూతురును కూడా కోల్పోయాడు.

2004 నుండి గడాఫీ అరాచకం మరీ ఎక్కువైందట. ఇటీవల తనకు వయసు మీద పడుతుంటడంతో తన కొడుకును పీఠంపై కూర్చుండ బెట్టాలని చూశాడు. అదే సమయంలో అరబ్బు దేశాలలో చెలరేగిన ఉద్యమాలు గడాఫీని వణికించాయి. ఉద్యమం పేరుతో లిబియాలు బయటకు వచ్చిన వారిపై కత్తి గట్టాడు. పౌరులను మూకుమ్మడిగా కాల్చి వేయించాడు. ఆ తర్వా తిరుగుబాటుదారులు, నాటో దళాల కాల్పులు అధికమవడంతో అజ్ఞాతంలోకి వెళ్లి గురువారం తప్పించుకోపోతూ హతమయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+