బాలయ్యకు రామకృష్ణ స్టూడియో తిప్పలు

మండలస్థాయిలో సర్వేయర్ చేసిన తప్పిదమే దీనిక్కారణమని తేలింది. దాంతో పీవోబీ నుంచి రామకృష్ణ స్టూడియో స్థలాన్ని తీసివేయాలని సినీ నటుడు బాలకృష్ణ జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. వాస్తవానికి రామకృష్ణ స్టూడియో భూముల లావాదేవీలపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు వెళ్లినప్పుడు ఈ వ్యవహారం బయటికొచ్చిందని ఈ ప్రముఖ దినపత్రిక రాసింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో తప్పు జరిగిందని నిర్ధారించారు.
హైదరాబాదులోని ముషీరాబాద్ మండలం గోల్కొండ చౌరస్తాలో టౌన్‌సర్వేనెం.2, బ్లాక్-జే, వార్డు-68లో రామకృష్ణ స్టూడియో ఉంది. ఇందులో 6714 వేల గజాలను పట్టాదారుల నుంచి నేరుగా కొనుగోలు చే యగా స్టూడియో విస్తీర్ణం కోసం 1762 గజాల స్థలాన్ని ప్రభు త్వం గజం రూ.40 లచొప్పున కేటాయించింది. అయితే ఈ భూమిని కొనుగోలు చేసినప్పటికీ రికార్డుల్లో ఇంకా ప్రభుత్వ భూమిగానే ఉండటంతో పీవోబీలో చేరినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ -1999 సెక్షన్ 22(ఏ) ప్రకా రం ప్రభుత్వ భూముల క్రయవిక్రయాలను నిషేధించారు. ఏ భూములను రిజిస్ట్రేషన్ చేయరాదో... వేటిని చేయొచ్చో నిర్దేశించే అధికారాన్ని ఆ సెక్షన్ కలెక్టర్‌కే అధికారాన్ని ఇచ్చింది. ఇప్పటి వరకు పీవోబీలో నిర్మాణాత్మకంగా మార్పులు, చేర్పులు చేయాలని ప్రజలు కోరిన దాఖలాల్లేవనిస తాజాగా ఇంటినెంబర్ల ఆధారంగా చేర్చడంతో సమస్య తెరమీదికొచ్చిందని ఆ పత్రిక రాసింది.












Click it and Unblock the Notifications