వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాద్షా షారూక్ ఖాన్ దిమ్మ తిరిగిందా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Shahrukh Khan
ముంబై: బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ అలిగాడా, మనస్తాపానికి గురయ్యాడా తెలియడం లేదు. అవుట్ లుక్‌లో తాను రాసిన వ్యాసంపై తలెత్తిన వివాదంతో ఆయన దిమ్మ తిరిగినట్లే ఉంది. ఆ వ్యాసంపై తీవ్ర దుమారం చెలిరేగిన విషయం తెలిసిందే. ఈ దుమారం కాస్తా పాకిస్తాన్, భారతదేశం మధ్య వాగ్వివాదానికి కూడా దారి తీసింది. దీంతో షారూక్ ఖాన్ వివరణ ఇవ్వక తప్పలేదు. పాకిస్తాన్ మంత్రి మాలిక్ ప్రకటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన షారూక్ భారతదేశం పట్ల తన విధేయతను, గౌరవాన్ని ప్రకటిస్తూ ప్రకటన చేశాడు.

ఇప్పుడు షారూక్ ఖాన్ రాజకీయాల గురించి గానీ మతం గురించిగానీ మాట్లాడబోనని భీష్మించుకున్నారు. ఇప్పటి నుంచి తాను రాజకీయాల గురించి గానీ, మతం గురించి గానీ మాట్లాడకూడదని నిర్ణయించుకున్నానని ఆయన ఓ ప్రముఖ పత్రికతో అన్నారు. అయితే, తాను భావ ప్రకటనా స్వేచ్ఛకు మాత్రమే ఓటేస్తానని చెప్పారు. తక్షణ సమస్యలపై మాట్లాడే అలవాటు ఉన్న షారూక్ ఇక నుంచి ఆ రెండు విషయాలపై మాట్లాడబోనని అంటున్నారు.

తానో నటుడిని అని, తనతో మాట్లాడాలదలుచుకుంటే తన సినిమాల గురించి మాట్లాడాలని, సీరియస్ విషయాల గురించి మాట్లాడాలనుకుంటే మీరు సీరియస్ వ్యక్తుల వద్దకు వెళ్లాలని, నటీనటుల వద్దకు రావద్దని ఆయన ఆ పత్రికతో అన్నారు. ఇటీవలి కాలంలో పలువురు కళాకారులు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. కమల్ హాసన్ విశ్వరూపం సినిమా దానికి పరాకాష్ట.

రచయిత సల్మాన్ రష్దీ వివాదం, రచయిత ఆశీష్ నందీ వివాదం మనం చూశాం. ఏం మాట్లాడినా వివాదంగా మారే పరిస్థితి ప్రస్తుతం దేశంలో నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఓ వ్యాఖ్యలోని వెనకా ముందులు చూడకుండా, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా వివాదాలు రేపడం ఆనవాయితీగా మారింది. ఆశీష్ నందీ విషయంలో అదే జరిగింది. తన ఆర్టికల్ విషయంలోనూ అదే జరిగిందని షారూక్ ఆవేదన వ్యక్తం చేశాడు.

చదవకుండా తన ఆర్టికల్‌పై వ్యాఖ్యలు చేయవద్దని ఆయన కోరారు. తాను తనకు భారతదేశంలో రక్షణ లేదని ఎక్కడా రాయలేదని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఒకవేళ మాట్లాడదలుచుకుంటే - తన వ్యాసాన్ని పూర్తిగా చదవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

English summary
Bollywood superstar Shahrukh Khan, whose article on Outlook magazine on being a Muslim post 9/11 terror attacks made headlines recently, is now wary of commenting on politics and religion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X