మామ.. చందమామ.. చెబుతాము నీ కథ!!
సాధారణంగా చంద్రుడిని చందమామ అని పిలుస్తూ ఉంటారు. రాత్రి దర్శనం ఇచ్చే చందమామను మనకు మనసుకు దగ్గరి వాడిగా చెప్తూ ఉంటారు. అసలు చంద్రుడు మామ ఎలా అయ్యాడు? చంద్రుడిని మామ అని పిలవటం వెనుక కారణం ఏమిటి? అనేది చాలా మందికి కలిగే ఒక సందేహం.
సినిమాలలో చూసినా, నిజ జీవితంలో ఎక్కడ విన్నా చందమామ అన్న పదమే ఎక్కువగా వినిపిస్తుంది. చందమామ రావే.. జాబిల్లి రావే అంటూ.. అనేక పాటలు కూడా చంద్రుడిని మామగానే మనకు పరిచయం చేస్తాయి. అసలు చంద్రుడు మనకు వరుసకు మామే.. ఏ కారణాలతో మనం చంద్రుడిని చందమామ అని పిలుస్తున్నాము అనే ఆసక్తికర విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం.

చాలామందికి చంద్రుడిని చందమామ ఎందుకు అంటారో తెలీదు. అన్నా అనో.. బాబాయ్ అనో ఎందుకు పిలవరు? వంటి సందేహాలు మాత్రం కలుగుతాయి. ఆ సందేహాలను నివృత్తి చెయ్యాలన్నా అసలు చందమామ కథ తెలియాలి. చంద్రుడిని మామా అని పిలవడానికి అనేక కారణాలున్నాయి. పౌరాణిక, భౌగోళిక, మతపరమైన కారణాల వల్ల చంద్రుడిని చందమామ అనే పిలుస్తాము.
చంద్రుడిని లక్ష్మీదేవి సోదరుడిగా భావిస్తారు. లక్ష్మీదేవిని మనమందరం అమ్మగా భావిస్తాం.. కాబట్టి అమ్మకు సోదరుడైన చంద్రుడు మనకు మామ అవుతాడు. అందుకే మనం చంద్రుడిని చందమామ అని పిలుస్తున్నాం అని చెబుతున్నారు. ఇది పౌరాణిక, మతపరమైన కారణం.ఇంకా భౌగోళిక కారణాలు కూడా ఉన్నాయి.
అంతేకాదు భౌగోళికంగా భూమికి ఏకైక ఉపగ్రహం చంద్రుడు. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సహజంగా సోదరీ, సోదరుల మధ్య ఒకరి చుట్టూ ఒకరి తిరిగే అవినాభావ సంబంధం ఉంటుంది. భూమిని మనమందరం అమ్మ భావిస్తాం. అమ్మ అయిన భూమి చుట్టూ తిరుగుతున్నాడు. కాబట్టి అమ్మ సోదరుడు అయిన చంద్రుడు మనకు మామ అవుతాడు. ఇది భౌగోళిక కారణం. ఈ రెండు కారణాల వల్ల చంద్రుడిని చందమామ అని పిలుస్తూ ఉంటాం.












Click it and Unblock the Notifications