మహంకాళీ బోనాల వైభవం: కెసిఆర్ దంపతులు(పిక్చర్స్)

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వేలాది మంది భక్తజనం నడుమ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుక ఆదివారం వైభవంగా జరిగింది. క్యూలైన్లలో తెల్లవారుజాము నుంచే బారులు తీరారు భక్తులు. ఇక ప్రధాన గేటు నుంచి ఆలయం వరకు పూల తోరణాలే. గర్భగుడి ముందు ప్రత్యేక గద్దె ఏర్పాటుచేశారు. పోలీసులు పటిష్ఠ బందోబస్తుతోపాటు అడుగడుగునా నిఘా నేత్రాలతో అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పర్యవేక్షించారు.

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం కెసిఆర్ దంపతులు

సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి జాతరలో తొలిరోజు సంబురాలు వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, సతీమణి శోభ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పట్టువస్త్రా సమర్పించారు.

అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. బోనాల సందర్భంగా రాష్ట్ర సాంస్కృతికశాఖ కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. మహంకాళి జాతరలో సోమవారం రంగం, భవిష్యవాణి కార్యక్రమాలు జరుగనున్నాయి.

సీఎం కెసిఆర్ దంపతులు

సీఎం కెసిఆర్ దంపతులు

వేలాది మంది భక్తజనం నడుమ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుక ఆదివారం వైభవంగా జరిగింది. క్యూలైన్లలో తెల్లవారుజాము నుంచే బారులు తీరారు భక్తులు.

సీఎం కెసిఆర్ దంపతుల పూజలు

సీఎం కెసిఆర్ దంపతుల పూజలు

ఇక ప్రధాన గేటు నుంచి ఆలయం వరకు పూల తోరణాలే. గర్భగుడి ముందు ప్రత్యేక గద్దె ఏర్పాటుచేశారు. పోలీసులు పటిష్ఠ బందోబస్తుతోపాటు అడుగడుగునా నిఘా నేత్రాలతో అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పర్యవేక్షించారు.

పట్టువస్త్రాలు సమర్పించిన కెసిఆర్ దంపతులు

పట్టువస్త్రాలు సమర్పించిన కెసిఆర్ దంపతులు

సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి జాతరలో తొలిరోజు సంబురాలు వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, సతీమణి శోభ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పట్టువస్త్రా సమర్పించారు.

ఆలయంలో కెసిఆర్

ఆలయంలో కెసిఆర్

అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.

సీఎం కెసిఆర్

సీఎం కెసిఆర్

బోనాల సందర్భంగా రాష్ట్ర సాంస్కృతికశాఖ కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. మహంకాళి జాతరలో సోమవారం రంగం, భవిష్యవాణి కార్యక్రమాలు జరుగనున్నాయి.

సీఎం కెసిఆర్ దంపతులు

సీఎం కెసిఆర్ దంపతులు

సుప్రసిద్ధ సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర ఆదివారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 14 రోజుల నుంచి ఎదుర్కోలు ఉత్సవాలతో సందడిగా ఉన్న లష్కర్ వీధులు బోనమెత్తిన మహిళలతో కిటకిటలాడాయి.

భక్తులకు కెసిఆర్ అభివాదం

భక్తులకు కెసిఆర్ అభివాదం

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, సతీమణి శోభతో కలిసి ఉదయం 9:15 గంటలకు శ్రీ ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పట్టువస్ర్తాలు, పసుపు, కుంకుమ సమర్పించారు. మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు సీఎంకు ఆహ్వానం పలికారు. పెద్ద సంఖ్యలో హాజరైన ప్రముఖులతో పాటు తొలిరోజు సుమారు ఏడు లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు.

బోనాల వైభవం

బోనాల వైభవం

పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయగా, రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక సారథి కళాకారులు కళాప్రదర్శనలు నిర్వహించారు.నేడు ఉదయం 9:30 గంటలకు రంగం కార్యక్రమం జరుగుతుంది.

బోనాల వైభవం

బోనాల వైభవం

రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

బోనాల వైభవం

బోనాల వైభవం

జనరల్ బజార్‌లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆలయ ప్రధాన అర్చకులు మేల్కొలుపు, హారతితో తొలిపూజను ప్రారంభించగా ఇందులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సతీసమేతంగా పాల్గొన్నారు.

బోనాల వైభవం

బోనాల వైభవం

శ్రీ ఉజ్జయిని మహంకాళి, శ్రీ మాణిక్యాలమ్మకు పట్టువస్ర్తాలు, ఒడిబియ్యం సమర్పించారు. తలసాని సతీమణి సాకపోసి, అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర ఆరంభమైంది. అప్పటికే సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన వేలాది మహిళలు బోనాలు సమర్పించేందుకు బారులు తీరారు.

పద్మా దేవేందర్

పద్మా దేవేందర్

బోనాల కోసం లష్కర్ సుందరంగా ముస్తాబైంది. ఉజ్జయినీ ఆలయానికి దారితీసే వీధుల్లో ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల ధగధగలు, పోతరాజుల వీరంగాలు, శివసత్తుల పూనకాలతో ఆ పరిసరాల్లో సందడి నెలకొంది.

బోనాల వైభవం

బోనాల వైభవం

సాయంత్రం వరకు సందడిగా సాగిన ఈ జాతరను తిలకించేందుకు నగరం నుంచే కాకుండా చుట్టుపక్క జిల్లాలు, ఇతర రాష్ర్టాల వారు లక్షల సంఖ్యలో తరలివచ్చారు.

బోనాల వైభవం

బోనాల వైభవం

మొక్కులు చెల్లించేందుకు, బోనాలు సమర్పించేందుకు, అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల కోసం ఆలయం చుట్టూ కిలో మీటరు వరకూ క్యూ లైన్లు ఏర్పాట్లు చేశారు. బోనాలు సమర్పించే మహిళలు, వీఐపీలతో పాటు వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chief Minister K Chandrashekar Rao, accompanied by his spouse, visited Ujjain Mahankali Temple in Secunderabad on Sunday and performed puja there.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి