టెక్కీల కోసం ప్రత్యేక యాప్ ఇదే: ఎక్కడ జాబ్స్ ఉన్నా వెంటనే తెలిసిపోతుంది!
ఓ వైపు సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థలు తమ సంస్థలోని ఉద్యోగులను తొలగిస్తామంటూ హెచ్చరికలు, మరో వైపు అమెరికా కష్టాలు, ఐటీ ఇండస్ట్రీ కొంత తిరోగమనమవుతున్న తరుణంలో టెక్కీల కోసం ఉపయోగపడే ఓ కొత్త యాప్
బెంగళూరు: ఓ వైపు సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థలు తమ సంస్థలోని ఉద్యోగులను తొలగిస్తామంటూ హెచ్చరికలు, మరో వైపు అమెరికా కష్టాలు, ఐటీ ఇండస్ట్రీ కొంత తిరోగమనమవుతున్న తరుణంలో టెక్కీల కోసం ఉపయోగపడే ఓ కొత్త యాప్ రూపుదిద్దుకుంది. తమకు ఉద్యోగాలు ఎలా? అనుకుంటున్న టెక్కీల కోసం ఐడీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఆ యాపే 'స్టార్టప్ జాబ్స్'(Startup Jobs).

ఎక్కడ ఖాళీలున్నా..
ఎక్కడ ఖాళీలున్నా ఈ యాప్ ద్వారా వెంటనే టెక్నాలజీ ప్రొఫెషనల్స్‌కు అలర్ట్‌లను పంపిస్తుంది. టెక్నాలజీ, సేల్స్, మార్కెటింగ్ ఆపరేషన్స్ వంటి స్టార్టప్స్‌లో ఎంపిక చేసిన జాబ్ ఓపెనింగ్స్ ను ఈ యాప్ ద్వారా పొందొచ్చు. అభ్యర్థులు ఈ యాప్‌లో తమ వీడియో ప్రొఫైల్స్ అప్ లోడ్ చేసుకోవచ్చు. దీంతో కంపెనీలు అభ్యర్థుల ప్రొఫైల్స్ చూసి, ఇంటర్వ్యూలకు పిలుస్తాయి.

వెంటనే స్టేటస్..
కంపెనీలు తమ ప్రొఫైల్స్‌ను చూసిన తర్వాత వెంటనే స్టేటస్ అప్ డేట్లను కూడా అభ్యర్థులు పొందుతారు. బెంగళూరుకు చెందిన హెచ్ఆర్ టెక్ స్టార్టప్ ఈ-ఫోయిస్ సిస్టమ్స్ ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది.

పెద్ద సంస్థలకే సేవలు
లండన్ బిజినెస్ స్కూల్ అల్యూమినీ సచిన్ అగర్వాల్, బిషన్ సింగ్ ఈ స్టార్టప్‌ను స్థాపించారు. హచ్చీ, సిమెన్స్, ఫ్లిప్ కార్ట్, ఫస్ట్ సోర్స్, ఓలా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ లాంటి సంస్థలు కస్టమర్లుగా ఉండటం గమనార్హం.

మంచి ప్రత్యామ్నాయం
ప్రస్తుత మార్కెట్లో ఉద్యోగాలను వెతుక్కోవడంలో ఈ యాప్ టెక్కీలకు మంచి ప్రత్యామ్నాయ మార్గమని 10వేల స్టార్టప్ కార్యక్రమ అధినేత కేఎస్ విశ్వనాథన్ తెలిపారు. అంతేగాక, ఈ సేవలు ఉచితంగానే అందించబడతాయని తెలిపారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications