వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేదార్‌నాథ్‌లో ఇంకా అస్థిపంజరాలు అలాగే....

By Pratap
|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్: ఘోరమైన ప్రకృతి వైపరీత్యం సంభవించిన మూడేళ్ల తర్వాత కూడా దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ లోయలో ఇంకా అస్థిపంజరాలు బయటపడుతున్నాయి. కేదార్‌నాథ్ 6 త్రియుగినారాయణ ట్రెక్ రూట్‌లో ఉత్తరాఖండ్ పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తగా అన్వేషణ చేపట్టాయి.

ఈ వారం ప్రారంభంలో చేపట్టిన అన్వేషణలో పలు అస్థిపంజరాలు బయటపడ్డాయి. అంత్యక్రియలు చేయడానికి ముందు వైద్య నిపుణులు డిఎన్ఎ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం ఉత్తరాఖండ్ పోలీసులు అస్థిపంజరాలను సామూహికంగా దహనం చేశారు.

అస్థిపంజరాల సంఖ్య ఎంత అనేది కచ్చితంగా చెప్పలేమని, 20 వరకు ఉండవచ్చునని రుద్రప్రయాగ్ ఎస్పీ ప్రహ్లాద్ సింగ్ చెప్పారు. 2013లో ఉవ్వెత్తున వరదలు ఎగిసిపడిన సమయంలో కేదార్ ప్రాంతం నుంచి లక్షా పది వేల మందికి పైగా తరలించిన విషయం తెలిసిందే.

 పర్యాటకం దెబ్బ తింటుందా

పర్యాటకం దెబ్బ తింటుందా

అస్థిపంజరాలు బయటపడటం వల్ల రాష్ట్రానికి ప్రధాన ఆదాయమైన టూరిజం దెబ్బతినే అవకాశముందని బీజేపీ సహా పలు పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2013లో ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని మెరుపు వేగంతో వరదలు ముంచెత్తడంతో కేదార్ లోయలోనే దాదాపు 4 వేల మంది గల్లంతయిన విషయం తెలిసిందే.

 అప్పుడు దొరికిన శవాలు ఇంతే...

అప్పుడు దొరికిన శవాలు ఇంతే...


అప్పట్లో గల్లంతయిన వారిలో కేవలం 827 మంది మృతదేహాలు మాత్రమే దొరికాయి. మిగితా వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో వారంతా మరణించి ఉంటారని అధికారులు ప్రకటించారు. గురువారం త్రియుగినారాయణ్, కేదార్‌నాథ్ మధ్య దట్టమైన అటవీ మార్గంలో మరికొన్ని అస్థిపంజరాలు లభ్యం కావడంతో మరోసారి ఈ విపత్తుపై దేశవ్యాప్తంగా దృష్టి మరలింది.

 పాతికేళ్ల తర్వాత కూడా బయటపడవచ్చు

పాతికేళ్ల తర్వాత కూడా బయటపడవచ్చు

రాజకీయ నేతలు, ప్రజల ఆందోళనను తాను అర్థం చేసుకోగలమని రుద్రప్రయోగ జిల్లా మేజిస్ట్రేట్ రాఘవ్ లాంగర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు ఇప్పటి నుంచి మరో 25 ఏళ్ల తర్వాత కూడా కేదార్ లోయలో అస్థిపంజరాలు దొరికినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని అన్నారు.

 ఇక్కడి పరిస్థితులు భిన్నమైనవి...

ఇక్కడి పరిస్థితులు భిన్నమైనవి...

ప్రకృతి వైపరిత్యం కారణంగా కేదార్‌నాథ్ లోయలో భౌగోళిక పరిస్థితులు చిన్నాభిన్నమయ్యాయని, ఈ ప్రాంతమంతా పునర్వైభవాన్ని పుణికి పుచ్చుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని లాంగర్ అన్నారు.

 62 శవాలు బయటపడ్డాయి

62 శవాలు బయటపడ్డాయి

రెండేళ్ల నాటి ప్రమాదానికి సంబంధించి తాజాగా 62 మృతదేహాలు బయటపడ్డాయి. ఇంకా 200 మంది శవాలు ఉండి ఉంటాయని అనుమానిస్తున్నారు. గత రెండు రోజుల్లో పోలీసులు 50 మృతదేహాలను కనిపెట్టారు. అక్టోబర్ 7వ తేదీన 12 శవాలు ట్రెక్కర్స్ కంటపడ్డాయి.

వచ్చే ఎన్నికల అంశంగా..

వచ్చే ఎన్నికల అంశంగా..

వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇది ఉత్తరాఖండ్‌లో ఎన్నికల అంశంగా మారే అవకాశం ఉంది. గాలింపు చర్యలను కాంగ్రెసు ప్రభుత్వం వదిలేసిందని, మొక్కుబడిగా గాలింపు చర్యలను చేపట్టి ముగించిందని ప్రతిపక్ష బిజెపి ఆరోపిస్తోంది.

 ఆయన్నే అడగండి...

ఆయన్నే అడగండి...

అప్పటి ముఖ్యమంత్రి విజయ బహుగణను ఆ విషయంపై ప్రశ్నించాలని కాంగ్రెసు అంటూ ఆయన బిజెపిలో చేరిన విషయాన్ని గుర్తు చేశారు. కేదార్‌నాథ్ ప్రకృతి విపత్తు తర్వాత బహుగుణ బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది.

English summary
A joint team of Uttarakhand police and State Disaster Response Force (SDRF) are in Kedarnath to conduct search operations on the Kedarnath-Triyuginarayan trek route where a number of skeletal remains were spotted by a trekking team earlier in the week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X