ఏప్రిల్‌లో వ‌చ్చే పండుగ‌లు..బ్యాంకుల సెల‌వుల జాబితా ఇదే..

ఏప్రిల్‌లో బ్యాంకుల‌కు సెల‌వులు ఎక్కువ‌గా ఉన్నాయి. మొద‌టి రోజు నుంచే సెల‌వులు ప్రారంభం కానున్నాయి. మార్చి 31వ తేదీ ఆర్థిక సంవ‌త్స‌రం ముగుస్తుంది. ఏప్రిల్ నెల‌తో కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25) ప్రారంభానికి గుర్తుగా, వచ్చే నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులు వరుస సెలవులు రాబోతున్నాయి. ఇక‌, ఏప్రిల్ వివిధ పండుగ‌లు, బ్యాంకుల సెల‌వుల జాబితాను చూసేద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన వార్షిక సెలవుల జాబితా ప్రకారం ఏప్రిల్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు 14 రోజులు సెలవులు రానున్నాయి.

ఏప్రిల్‌లో బ్యాంకుల‌కు దేశవ్యాప్తంగా మొత్తం సెలవుల సంఖ్య ఒకే విధంగా ఉన్నప్పటికీ, రాష్ట్రం లేదా ప్రాంతాన్ని బట్టి సెలవు రోజు మారుతూ ఉంటుంది. వ‌చ్చే నెల మొదటి రోజు నుంచే బ్యాంక్‌ల‌కు సెల‌వులు రానున్నాయి. ఏప్రిల్‌లో ఉగాది, గుఢి పడ్వా, ఈద్-ఉల్-ఫితర్, బోహాగ్ బిహు, శ్రీరామ నవమి, బైశాకి వంటి పండగలకు బ్యాంక్‌లకు సెలవులు వచ్చాయి. ఏప్రిల్‌ నెలలో నాలుగు ఆదివారాలు, రెండో శ‌నివారం, నాలుగో శనివారాలు కూడా బ్యాంక్‌ల‌కు సెల‌వులే. బ్యాంకుల సెల‌వుల జాబితాను చూద్దాం.

This is the list of festivals coming in April bank holidays

ఏప్రిల్‌లో బ్యాంక్‌ సెలవు రోజులు..

ఏప్రిల్ 01,2024 (సోమవారం): వార్షిక ఖాతాల ముగింపు కోసం బ్యాంకులు మూస్తారు. కాబ‌ట్టి ఆరోజు ఎలాంటి లావాదేవీలు జరగవు.
ఏప్రిల్ 05, 2024(శుక్రవారం): బాబు జగ్జీవన్ రామ్ జయంతి, జుమాత్-ఉల్-విదా
ఏప్రిల్ 07‍, 2024 ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
ఏప్రిల్ 09, 2024 ‍‌(మంగళవారం): గుఢి పడ్వా, ఉగాది, సాజిబు నొంగ్మపన్బా (చెయిరాబా), 1వ నవరాత్రి
ఏప్రిల్ 10, 2024 ‍‌(బుధవారం): రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్)
ఏప్రిల్ 11, 2024 ‍‌(గురువారం): రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) (1వ షావాల్)
ఏప్రిల్ 13‍, 2024 బోహాగ్ బిహు, చీరోబా, బైశాఖి, బిజు పండుగ + రెండో శనివారం
ఏప్రిల్ 14, 2024 ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
ఏప్రిల్ 15, 2024 ‍‌(సోమవారం): బోహాగ్ బిహు, హిమాచల్ డే
ఏప్రిల్ 17, 2024 (బుధవారం): శ్రీరామ నవమి
ఏప్రిల్ 20, 2024 (శనివారం): గరియా పూజ
ఏప్రిల్ 21, 2024 ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
ఏప్రిల్ 27, 2024 నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు
ఏప్రిల్ 28, 2024 ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు

దేశంలో బ్యాంక్ సెలవులు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టం 1881 కింద లిస్ట్‌ అయ్యాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్, మొత్తం ఏడాదికి వార్షిక బ్యాంక్ సెలవుల క్యాలెండర్‌ను ప్రచురిస్తుంది. దీనిని దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు అనుసరిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+