టీమిండియాకు 32వ టెస్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ
అడిలైడ్: భారత్ - ఆస్టేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టుకి నాయకత్వ బాధ్యతలను స్వీకరించిన విరాట్ కోహ్లీ టీమిండియాకు 32వ టెస్టు కెప్టెన్ అయ్యాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా విరాట్ కోహ్లీ ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు.
బొటన వేలు గాయం కారణంగా మహేంద్ర సింగ్ ధోని తొలి టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకోవడంతో టీమిండియా మేనేజ్‌మెంట్ విరాట్ కోహ్లీకి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. డిసెంబర్ 17 నుంచి బ్రిస్‌బేన్‌లో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కి తిరిగి కెప్టెన్‌గా ధోని సారధ్య బాధ్యతలను చేపడతాడు.
కెప్టెన్ హోదాలో టాస్‌కి వెళ్లిన విరాట్ కోహ్లీ మాట్లాడుతూ చాలా ఆనందంగా ఉంది. నా తొలి టెస్టు సెంచరీ చేసిన అడిలైడ్ ఓవల్ మైదానంలో టెస్టు కెప్టెన్‌గా అరంగేట్రం చేయడం సంతోషంగా ఉందని చెప్పాడు. 26 ఏళ్ల విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 30వ టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు.

టీమిండియా తరుపున వన్డేల్లో ఇప్పటికే కెప్టెన్‌గా తనేంటో నిరూపించుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇటీవలే భారత్ - శ్రీలంక పర్యటనలో కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ శ్రీలంకను వైట్ వాష్‌ను చేశాడు. 1932లో లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌పై టీమిండియాకు తొలి టెస్టు కెప్టెన్‌గా కల్నల్ సీకె నాయుడు సారధ్య బాధ్యతలను స్వీకరించారు.
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్టేలియా ఓపెనర్ ఫిల్ హ్యూస్ మృతితో డిసెంబర్ 4న బ్రిస్‌బేన్‌లో ఆరంభం కావాల్సిన తొలి టెస్టును డిసెంబర్ 9కి రీషెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే.
టీమిండియా టెస్టు కెప్టెన్లు వరుసగా:
1. CK నాయుడు 1932-34 (4 టెస్టులు)
2. మహారాజా విజయనగరం 1936 (3)
3. పటౌడీ నవాబు 1946 (3)
4. లాలా అమర్నాథ్ 1947-52 (15)
5. విజయ్ హజారే 1951-53 (14)
6. వినూ మన్కడ్ 1955-59 (6)
7. గులాం అహ్మద్ 1955-59 (3)
8. పాలీ ఉమ్రీగర్ 1955-58 (8)
9. హేము అధికారి 1959 (4)
10. దత్త గైక్వాడ్ 1959 (4)
11. పంకజ్ రాయ్ 1959 (1)
12. గులబ్రాయ్ రామ్‌చంద్ 1959-60 (5)
13. నారీ కాంట్రాక్టర్ 1960-62 (12)
14. మన్సూర్ ఆలీ ఖాన్ 1962-75 (40)
15. చందు బోర్డే 1967 (1)
16. అజిత్ వాడేకర్ 1971-74 (16)
17. శ్రీనివాస్ వెంకటరాఘవన్ 1974-79 (5)
18. సునీల్ గవాస్కర్ 1976-85 (47)
19. బిషన్ సింగ్ బేడీ 1976-78 (22)
20. GR విశ్వనాధ్ 1980 (2)
21. కపిల్ దేవ్ 1983-87 (34)
22. దిలీప్ వెంగ్సర్కార్ 1987-89 (10)
23. రవి శాస్త్రి 1988 (1)
24. క్రిస్ శ్రీకాంత్ 1989 (4)
25. మొహమ్మద్ అజారుద్దీన్ 1990-99 (47)
26. సచిన్ టెండూల్కర్ 1996-2000 (25)
27. సౌరవ్ గంగూలీ 2000-05 (49)
28. రాహుల్ ద్రావిడ్ 2003-07 (25)
29. వీరేంద్ర సెహ్వాగ్ 2005-12 (4)
30. అనిల్ కుంబ్లే 2007-08 (14)
31. ధోనీ 2008 నుంచి ప్రస్తుతం (58)
32. విరాట్ కోహ్లీ 2014 (1)
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications