చిరు వేషము మార్చెను

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి రైతు కుటుంబం నుంచి వచ్చినవారు. ఆయనకు రైతు వేషం బాగా ఉంటుంది. ఆయన దాదాపు పంచె కట్టులోనే కనిపించేవారు. తన సుదీర్ఘ పాదయాత్రలో ఆయన ధోవతిని పైకి మడిచి కట్టి, తలకు రుమాలు చుట్టుకున్నారు. దాదాపుగా ఇదే వేషంలో చిరంజీవి కనిపిస్తున్నారు. అయితే వేషం మార్చినంత మాత్రాన రాజకీయాల్లో అగ్రస్థానం అందుకోగలనని చిరంజీవి అనుకుంటే అది తప్పే అవుతుంది.
రాజకీయాల్లో ఆయన గతానుభవాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు లేదు. రైతు బాంధవుడిగా కనిపించడానికి వేషం సరిపోదని కాంగ్రెసు కార్యకర్తలు అంటున్నారు. రైతు సమస్యలు బాగా తలిసి అందుకు పరిష్కార మార్గాలను కనుక్కునే నేర్పు చిరంజీవికి లేదని అంటున్నారు. రాజకీయాలు వేరు, సినిమాలు వేరని అంటున్నారు. ప్రజలను ఆకట్టుకోవడానికి వేషాలు పనికి రావని, వారికి దగ్గర కావడానికి వారి సమస్యలను తీర్చగలిగే నాయకుడిగా ప్రజలు విశ్వసించవలసి ఉంటుంది. ఆ పని చిరంజీవికి అంత సులభం కాదు.












Click it and Unblock the Notifications