• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోటాలో కోటా ఎందుకు?

By రవికిరణ్
|

women's Reservation Bill opposed
ప్రజాస్వామ్యంలో మెజారిటీ పేరు మీద మైనారిటీల గొంతు ఎలా నొక్కేస్తారా రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన తీరు తెలియజేస్తుంది. మెజారిటీ, మైనారిటీ అనే విషయాలు ముందుకు వచ్చే సరికి న్యాయాన్యాయాల విచక్షణ ఉండదు. న్యాయమైన కోరికే అయినా మెజారిటీ పేరు మీద పక్కకు పడవచ్చు. మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో ఆమోదించిన వ్యవహారం దీనికి అద్దం పడుతుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను చట్టబద్దం చేసేందుకు మహిళా రిజర్వేషన్ల బిల్లును కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేయించుకుంది. లోకసభలో కూడా అది సులభంగానే ఆమోదం పొందుతుంది. ఈ బిల్లు విషయంలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ మాటను కూడా ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏకాభిప్రాయం కావాలని ఆమె అన్నారు.

మహిళా కోటాలో సబ్ కోటా కావాలంటూ సబ్ కోటా కావాలంటూ సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్, ఆర్జెడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, జెడి (యు) నేత శరద్ యాదవ్ డిమాండ్ చేస్తూ బిల్లును వ్యతిరేకించారు. వారిని మహిళా వ్యతిరేకులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. అలాగే బిఎస్పీ నేత మాయావతి కూడా ప్రస్తుత రూపంలో మహిళా బిల్లును వ్యతిరేకించారు. మహిళ నేత అయి ఉండి దాన్ని వ్యతిరేకించడాన్ని తప్పు పడుతున్నారు. కానీ వారి డిమాండ్ లోని సామంజస్యాన్ని అర్థం చేసుకోవడానికి ఏ మాత్రం ప్రయత్నాలు జరగలేదు.

గత 14 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ల బిల్లు ఎస్సీ, ఎస్టీ, ఒబిసి, ముస్లింలకు సబ్ కోటా కేటాయించకపోవడం వల్ల ఆమోదానికి నోచుకోలేదు. కానీ యుపిఎ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అదే రూపంలో దాన్ని ఆమోదింపజేసుకుంది. మహిళా బిల్లు అమలులోకి వస్తే ఎస్సీ, బిసి, ఎస్టీ, ముస్లింలకు అన్యాయం జరుగుతుందనేది ఎవరూ కాదనలేని నిజం. ఈ వర్గాల మహిళలకు సబ్ కోటా కేటాయించి ఉంటే బిల్లుపై ఏ విధమైన వ్యతిరేకత ఎదురై ఉండేది కాదు. మంగళవారం బిల్లును బలపరుస్తూ మాట్లాడినవారిలో చాలా మంది, బిల్లు ఆమోదం తర్వాత హర్షాతిరేకాలు వ్యక్తం చేసుకుంటూ పార్టీలకతీతంగా జమ కూడిన నాయకుల్లో ఎక్కువ మంది అగ్ర కులాలవారే కావడం విశేషం. వారికి బిల్లు ప్రస్తుత రూపంలో ఆమోదం పొందడానికి ఏ విధమైన అభ్యంతరాలుండవు.

విద్య, ఉద్యోగాల్లో ప్రైవేటీకరణ వల్ల దళితులు, బహుజనులకు రిజర్వేషన్ల కోత చాప కింద నీరులా పరుచుకుంటోంది. ఇదే సమయంలో చట్టసభల్లో వారి రిజర్వేషన్లు కుదించుకుపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. అగ్రకులాల పెత్తనం చట్టసభల్లో విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల దళిత, మైనాటిరీ, బహుజన స్త్రీలే కాదు, పురుషుల గొంతు కూడా మరింత మైనారిటీలో పడిపోతుంది. మహిళలకు సగం వాటా దక్కాలనే వాదనను వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఆ సగం మందిలో జనాభాలో మెజారిటీ అయిన దళిత, మైనారిటీ, బహుజన స్తీలు ఉండాలని కోరుకోవడం మరింత న్యాయం. ఆ న్యాయాన్ని యుపిఎ ప్రభుత్వం మెజారిటీ పేరుతో కాదనే స్థితికి వచ్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X