జగన్ తెలంగాణ అనుకూల వైఖరి?

కాంగ్రెసుకు దగ్గరైన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సమైక్యాంధ్ర నినాదం తీసుకోవడంతో తెలంగాణ అనుకూల వైఖరి తనకు ఎనలేని ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు, తెరాసలు కుమ్మక్కయి తెలంగాణ అంశాన్ని రాజకీయాలకు మాత్రమే వాడుకుంటూ తెలంగాణ సాధన అంశాన్ని పక్కన పెడుతున్నాయనే వాదనను ఆయన బలంగా వినిపించే అవకాశాలున్నాయి. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, కాంగ్రెసు సీనియర్ నాయకుడు కె. కేశవరావుల మధ్య జరిగిన రహస్య సమాలోచనలేమిటో వెల్లడించాలని ఇటీవల కొండా సురేఖ అడిగారు. దీన్ని బట్టి వైయస్ జగన్ వైఖరి తెలంగాణపై ఎలా ఉంటుందో, తెరాస, కాంగ్రెసులను ఏ విధంగా ఇరకాటంలో పెట్టవచ్చో వైయస్ జగన్ ఒక అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు.
తెలంగాణ ఇవ్వాల్సింది కాంగ్రెసు పార్టీ అని, ఇందులో తాను చేయాల్సిందేమీ లేదని, తెలంగాణ ఇస్తే తాను అడ్డుకోబోనని వైయస్ జగన్ తెలంగాణ ప్రజలకు వివరించే అవకాశాలున్నాయి. అవసరమైతే తెలంగాణ రాష్ట్ర సాధనకు తన సహకారం ఉంటుందని కూడా ఆయన చెప్పే అవకాశాలున్నాయి. 2014లో అధికారమే పరమావధిగా వైయస్ జగన్ ప్రాంతీయ పార్టీ పెడుతున్నారు. దాని కోసం ఆయన తెలంగాణ వైఖరిని మార్చుకోవచ్చునని అంటున్నారు. మొత్తం మీద, కొద్ది రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications