బాబు వ్యూహం: బాలయ్యకు కీలక పదవి

తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతం నుండి బాలయ్య ఇమేజ్ పార్టీకి బాగా దోహదపడుతుంది. ఇటీవల విడుదలైన శ్రీరామరాజ్యం చిత్రంకు తెలంగాణవాదుల(నవంబర్ 1న తాను చేసిన వ్యాఖ్యల పట్ల వివాదం చెలరేగడంతో బాలయ్య ఆ తర్వాత వివరణ ఇచ్చుకున్నారు) నుండి ఎలాంటి అడ్డంకులు ఏర్పడలేదు. అదే చిరు ఫ్యామిలీ చిత్రాలను అడ్డుకున్నారు. దీంతో ఇరు ప్రాంతాల ప్రజల మన్ననలు పొందిన బాలయ్యకు ఉప ఎన్నికలకు ముందే కమిటీలో చోటు కల్పిస్తే ప్లస్ అవుతుందని బాబు భావిస్తున్నారట. ఇప్పటి వరకు బాలయ్య అప్పుడప్పుడు టిడిపి ఆఫీసుకు రావడం, ఎన్నికల సమయంలో మాత్రమే ప్రచారం చేస్తూ గెస్టు అప్పియరెన్స్ ఇస్తున్నారు. బాలయ్య కనిపించగానే క్యాడర్‌లో ఒకింత ఉత్సారం తొణికిసలాడుతోంది. దీనిని బాబు పసిగట్టారట.
దీంతో గెస్టుగా కాకుండా క్రియాశీలకంగా వ్యవహరించేందుకు ఆయనకు పదవిని అప్పగించాలనే నిర్ణయానికి దాదాపుగా వచ్చినట్లుగా తెలుస్తోంది. బాలయ్య కూడా రాజకీయ రంగ ప్రవేశానికి ఉత్సుకతో ఎదురు చూస్తున్నారట. అయితే ఆయన ఆరంగేట్రంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయట. మరికొంతకాలం నిరీక్షిస్తేనే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నట్లుగా సమాచారం. 2014వరకు సింహా, శ్రీరామరాజ్యం వంటి మరిన్ని హిట్ సినిమాలు తీసి ఆ సమయంలో వస్తే బాగుంటుందని చెబుతున్నారట.












Click it and Unblock the Notifications