తెలంగాణ సమస్య పరిష్కారానికి ఓ చిట్కా

ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే వీరందరూ చెబుతున్నది ఒక్కటే మాట - మాకు పదవులు ముఖ్యం కాదు తెలంగాణ ముఖ్యం, తెలంగాణ కోసము మేము దేనికైనా సిద్దమని. కాబట్టి తెలంగాణ సమస్యతో సతమతమవుతున్న కేంద్రానికి ఒక సలహా. అదేమిటంటే తెలంగాణపై ఇంత చిత్తశుద్దిని ప్రదర్శించిన వారికోసం తెలంగాణ ఇవ్వాలని కాకపోతే ఒకే ఒక్క షరతు ఏమిటంటే తెలంగాణ కోసం ఇప్పుడురాజీనామాలు చేసిన వారు, ఇంకా పోరాడుతున్న నాయకుల వివరాలు పార్టీలపరంగా లిస్టు తయారుచేసి కేంద్రానికి సమర్పించాలి. ఇలా లిస్టులో ఉన్నవారు తెలంగాణ వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు ఎన్నికలలో కానీ, లేదా నామినేటేడ్ పదవులలో కానీ చట్టసబలకు పోటీ చెయ్యరాదు. వీరే కాదు వీళ్ళ కుటుంబ సభ్యులు అనగా అక్కాచెల్లెల్లు, అన్నదమ్ముల్లు 30 సంవత్సరాలు ఎన్నికలలో పోటీ చెయ్యరాదు.
పై షరతుకు ఒప్పుకుంటే, తెలంగాణ (హైదరాబాద్ తో సహా) ఒక నెలలో ఇచ్చినా అటు సీమా౦ధ్రులకు కాని ఇటు తెలంగాణ వారికి కాని ఎటువంటి అభ్యంతరం వుండకపోవచ్చు. కాబట్టి తెలంగాణ కోసం పోరాడుతున్న మన ప్రజాప్రతినిధులు ఆమరణ దీక్షలతో ప్రాణత్యాగాలు చేయకుండా, తమ పదవులను కేవలం 30 సంవత్సరాలు వదలుకుంటే చాలు! కేంద్రప్రబుత్వం ఈవిషయాన్ని తేలికగా తీసుకోకుండా బాగా అలోచించి త్వరితగతిన తెలంగాణ ఇవ్వాలని ఆశిస్తూ........................
- కిరణ్ కుమార్
రచయిత అభిప్రాయాలతో వన్ ఇండియా తెలుగుకు ఏ విధమైన సంబంధం లేదు.












Click it and Unblock the Notifications