వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు టూర్‌పై తర్జన: ఎన్టీఆర్ దారిలోనే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu - NT Rama Rao
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు దారిలోనే నడిచే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. 1989-1994 మధ్య కాలంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎన్టీఆర్ టిడిపి అధికారంలోకి వచ్చే వరకు అసెంబ్లీకి రాకూడదని నిర్ణయం తీసుకున్నారని, ఇప్పుడు చంద్రబాబు కూడా అలాంటి నిర్ణయమే తీసుకోనున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని బాబు వద్ద నేతలు ప్రస్తావించినప్పుడు బాబు తన నిర్ణయాన్ని ఖచ్చితంగా వెల్లడించక పోయినప్పటికీ అనుకూలంగా ఉన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

వంద రోజుల పాటు రాష్ట్ర యాత్రను తలపెట్టిన చంద్రబాబు దీనిని విభిన్నంగా చేయాలని నిర్ణయించారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన 117 రోజుల పాటు మీ కోసం పేరుతో రాష్ట్ర పర్యటన జరిపారు. ప్రత్యేకంగా రూపొందించిన బస్సులో ఆ యాత్ర జరిగింది. ఈసారి దానికి భిన్నంగా పార్టీ నేతలు ఎక్కువ మంది సైకిల్ యాత్రను ప్రతిపాదించారు. సైకిల్ తెలుగుదేశం పార్టీ గుర్తు. సామాన్యుడి వాహనం. దానిపై ప్రజల్లోకి వెళ్తే విభిన్నంగా ఉంటుంది. రాష్ట్రం మొత్తాన్ని ఇంతవరకూ సైకిల్‌పై పర్యటించిన నేత లేరు. ప్రజలకు చేరువగా వెళ్లడానికి ఇంతకు మించిన మార్గం లేదన్నది పలువురి వాదన.

బస్సుతో పోలిస్తే సైకిల్‌పై ఎక్కువ ప్రాంతాన్ని సందర్శించడం సాధ్యం కాదని, పైగా ప్రజల వద్ద ఆగి మాట్లాడుతూ వెళ్లడానికి ఈ యాత్ర అంత సౌకర్యంగా ఉండదన్నది మరికొందరి అభిప్రాయం. అదే సమయంలో, చంద్రబాబు మొగ్గు పాదయాత్రపై ఉన్నట్లు చెబుతున్నారు. దీని వల్ల సామాన్యుల్లోకి వెళ్లి వారిలో కలిసిపోవడం తేలికగా ఉంటుందని, ఎక్కడైనా ఆగవచ్చు.. ఎవరితోనైనా మాట్లాడవచ్చన్నది ఆయన అభిప్రాయం. గతంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర బాగా ప్రచారం పొందినందున ఇప్పుడు అలా చేస్తే ఆయన్ని అనుకరించినట్లవుతుందని, అది సరైంది కాదేమోనన్న అభిప్రాయంలో వారున్నారు.

ఈ రెండూ కాకపోతే గతంలో మాదిరిగా బస్సు యాత్ర నిర్వహించాలన్నది మూడో ప్రతిపాదన. విభిన్నంగా ఉండాలనుకుంటే తప్ప అన్నింటికంటే ఇది మేలైందని, ఎక్కువ ప్రాంతాలను సందర్శించవచ్చని ఆ పార్టీ నాయకులు కొందరు అంటున్నారు. అక్టోబర్ 2న ఈ యాత్ర మొదలు పెట్టాలని చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకొన్నారు. చంద్రబాబు పర్యటనలు ఏవైనా హైదరాబాద్ నుంచో లేదా తిరుపతి నుంచో మొదలు కావడం సంప్రదాయం.

కానీ, ఈసారి శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు తన యాత్రను శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టడమే దీనికి కారణం. జడ్ కేటగిరీలో ఉండటంతో ఆయన ఎక్కడ పర్యటించినా చుట్టూ భారీగా భద్రతా సిబ్బంది ఉంటున్నారు. ఈసారి వారిని వెనక ఉంచాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. చంద్రబాబుకు ఇప్పటికీ భద్రత సమస్య ఉందని, ఆ విషయంలో ఆచితూచి వ్యవహరించకపోతే ఇబ్బంది తప్పదని వారు వాదిస్తున్నారు. ఈ యాత్రను జనవరి 26న ముగించాలని చంద్రబాబు మొదట అనుకొన్నారు. ఫిబ్రవరి 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉండటం దీనికి కారణం.

కానీ ఒక సీనియర్ నేత.. బాబు యాత్రను అప్పుడే ఆపవద్దని కోరారు. అసెంబ్లీకి మీరు రాకపోయినా పర్వాలేదని, తామంతా ఉన్నామని, మీరు జనంలోనే ఉండండని, మీరు ఎంత ఎక్కువ ప్రజల్లో ఉంటే పార్టీకి అంత మేలు అని, గతంలో ఎన్టీఆర్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నారని చెప్పారు. దీనిపై బాబు తన నిర్ణయాన్ని చెప్పనప్పటికీ సుముఖంగానే ఉన్నారని అంటున్నారు. కాగా బాబు ఒకవేళ బస్సు యాత్ర చేపడితే అందుకోసం ఓ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పూణేలో ప్రత్యేకంగా చేయించనున్నారట.

English summary

 Telugudesam Party chief Nara Chandrababu Naidu may follow late NTR for his state tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X