వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమ్మె నోటీసు: కెసిఆర్ ఉప ఎన్నికల వ్యూహం?

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
రానున్న ఉప ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఓ వ్యూహం ప్రకారం ముందుకు వెళుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మూడు రోజుల క్రితం తెలంగాణ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిని కలిసి సమ్మె నోటీసు ఇవ్వడం కెసిఆర్ ఎన్నికల వ్యూహంలో భాగమనే వాదనలు వినిపిస్తున్నాయి. సకల జనుల సమ్మె సమయంలో టిఆర్ఎస్ పార్టీ బాగా పుంజుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత పోలవరం టెండర్లు వంటి కొన్ని విషయాలు ఆ పార్టీని కొద్దిగా మసకబార్చాయని చెప్పవచ్చు. సకల జనుల సమ్మెను కెసిఆర్ పోలవరం టెండర్ల కోసం కాంగ్రెసు ప్రభుత్వానికి తాకట్టు పెట్టారని టిడిపి నేతలు విమర్శించారు, విమర్శిస్తున్నారు. పోలవరం టెండర్ల కోసం వేసిన ష్యూ కంపెనీలో నమస్తే తెలంగాణ ఎండికి వాటా ఉండటం, ఆ తర్వాత టిడిపి దీనిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకు వెళ్లడంతో ప్రభుత్వం దానిపై వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. పోలవరం టెండర్లకు సకల జనుల సమ్మెకు సంబంధం పెట్టి టిడిపి నిత్యం విమర్శలు చేస్తుండటంతో స్వయంగా కెసిఆర్ కూడా టెండర్లు రద్దు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాయాల్సి వచ్చింది. టిడిపి తమపై ఆరోపణలు చేస్తున్నట్లుగా టెండర్ల విషయంలో తమ పాత్ర ఏమీ లేదని టిఆర్ఎస్ నేతలు చెబుతున్నప్పటికీ, ఈ ప్రభావం పార్టీపై కొద్దిగా పడిందనే చెప్పవచ్చు.

ఇదే సమయంలో తెలంగాణలోని ఆరు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు, ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందడం ఖాయం. కానీ భారీ మెజార్టీ సాధించడం ఇప్పుడు టిఆర్ఎస్‌కు ఖచ్చితంగా అవసరం. ఇటీవల సకల జనుల సమ్మె సమయంలో జరిగిన బాన్సువాడ ఉప ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థికి కనీసం ధరావత్తు కూడా రాదని అందరూ భావించారు. కానీ అతను భారీ ఓట్లు సాధించాడు. ఇది టిఆర్ఎస్‌కు గట్టి దెబ్బ. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలోనే బాన్సువాడ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అనుకున్న మెజార్టీని సాధించక పోవడం చూస్తే పోలవరం టెండర్లతో చిక్కుల్లో ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో మరింత మెజార్టీ తగ్గవచ్చని టిఆర్ఎస్ నేతలు భావిస్తున్నారని అంటున్నారు. అందుకే ఉప ఎన్నికల్లో విపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు కెసిఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు. అందులో భాగంగానే ఉద్యోగుల సమ్మె నోటీసులు, జెఏసిలో అసంతృప్తితో ఉన్న పార్టీలను కలుపు వెళ్లడం జరుగుతుందని పలువురు భావిస్తున్నారు.

English summary
It seems, TRS chief K Chandrasekhar Rao behind TNGO strike warning to government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X