కెసిఆర్‌పై కొండా సురేఖ పైచేయి!

 K Chandrasekhar Rao - Konda Surekha
రెండు మూడు రోజులుగా జరుగుతున్న ఘటనలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొండా సురేఖ పై చేయి సాధించినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. మూడు రోజుల క్రితం సురేఖ వ్యాఖ్యల కారణంగానే వైయస్సార్ కాంగ్రెసు - తెరాసల మధ్య ఢీ అంటే ఢీ అనే పరిస్థితి వచ్చింది. తెలంగాణ అంశంలో సురేఖ ఎప్పుడూ కెసిఆర్‌ను టార్గెట్ చేస్తుంటారు.

అందులో భాగంగానే మూడు రోజుల క్రితం ఆమె తెలంగాణ కోసం కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకోవాలనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దానిపై స్పందించిన కెసిఆర్ అదో పిచ్చితనమని.. తనను అనే వాళ్లే ఆత్మహత్య చేసుకోవాలని కౌంటర్ వేశారు. అయితే ఆ తర్వాత కెసిఆర్ సవాల్‌ను కొండా సురేఖ స్వీకరించడం గమనార్హం. కెసిఆర్ చెప్పినట్లుగా తాను ఆత్మహత్యకు సిద్ధమని, వాళ్ళు కూడా రావాలని ప్రతి సవాల్ విసిరారు.

మరో అడుగు ముందుకేసి... అఖిల పక్ష సమావేశంలోగా కెసిఆర్ తేది, సమయం ఫిక్స్ చేయాలని సవాల్ చేశారు. అదే సమయంలో ఆమె కెసిఆర్ తీరును తప్పు పట్టారు. జగన్ అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేస్తామని చెబుతున్నారని, రాజన్న రాజ్యం తెస్తామని చెబుతున్నారని, రాజన్న రాజ్యం అంటే తెలంగాణవాదులను అణగదొక్కడమా, వైయస్ తెలంగాణ అఢ్డుకున్నారని ఇలా తెరాస పలు ప్రశ్నలు సంధించింది. తెరాస నేతల వ్యాఖ్యలకు సురేఖ సమాధానం చెప్పారు.

అప్పుడు వైయస్ తెలంగాణను అడ్డుకుంటే ఇప్పుడు ఎవరు అడ్డుకుంటున్నారని, వైయస్ హయాంలోనే కొందరు ప్రజాప్రతినిధులం తెలంగాణ కావాలని లేఖ రాశామని, అలాంటప్పుడు వైయస్ అడ్డుపడ్డారని ఎలా చెబుతారని ఎదురు ప్రశ్నించింది. కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత.. ఇలా అందరూ కుటుంబ సభ్యులే ఉన్నారని సురేఖ ఆరోపించారు. దానికి తెరాస కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో జగన్, షర్మిల, గౌరవాధ్యక్షులుగా విజయమ్మలదే కీలకం అంటూ తిప్పి కొట్టారు.

షర్మిల తన సోదరుడు జైలులో ఉన్నందుకు పాదయాత్ర చేస్తున్నారు తప్ప కుటుంబ పెత్తనం కోసం కాదని వివరణ ఇస్తున్నారు. ఉద్యమం పేరుతో కెసిఆర్ కుటుంబ సభ్యులు దోచుకుంటున్నారని, కానీ షర్మిల, విజయమ్మలు దోచుకోవడానికి బయటకు రాలేదంటున్నారు. అంతేకాకుండా అఖిల పక్షంలో మేం తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తే కెసిఆర్ ఎన్ని రోజుల్లో తెలంగాణ తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

కెసిఆర్ తెలంగాణ తెస్తే తాము తెరాసలో చేరుతామని లేదంటే కెసిఆర్ తన పార్టీని వైయస్సార్ కాంగ్రెసులో విలీనం చేస్తారా అని ప్రశ్నించారు. ఇదిగో తెలంగాణ అదిగో తెలంగాణ అంటూ ప్రజలను మభ్య పెడుతోంది వారేనని, తాము ఎవరినీ మభ్య పెట్టడం లేదంటున్నారు. తన ఇంటిని తెరాస కార్యకర్తలు ముట్టడిస్తే తప్పు లేదు. కానీ తమ పార్టీ కార్యకర్తలు తెరాస కార్యాలయాన్ని ముట్టడిస్తే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. వారు దిష్టిబొమ్మ తగులబెట్టవచ్చు. కానీ మేం తగులబెట్టకూడదా అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+