రెడ్డిగారు పోయారులో వర్మ టార్గెట్ చిరంజీవి?

రెడ్డిగారు పోయారు సినిమాలో వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీలో నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టడం వంటి విషయాలుంటాయని అనుకోవచ్చు. అదే విధంగా ముఖ్యమంత్రి పదవి కోసం వైయస్ జగన్ వర్గం చేసిన ప్రయత్నాలు, సంతకాల సేకరణ వంటి అంశాలు ఉంటాయా, ఉంటే ఏ మేరకు ఉంటాయనేది ఆసక్తికరమైన విషయమే. అయితే, సినిమాలో గత ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత కాంగ్రెసు శాసనసభ్యుడు మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేసుకోవాలని రామ్ గోపాల్ వర్మ అనుకుంటున్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.
చిరంజీవికి, రామ్ గోపాల్ వర్మకు మధ్య సంబంధాలు అంత సాఫీగా లేవనే విషయం అందరికీ తెలుసు. ఈ స్థితిలో చిరంజీవి వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత రాజకీయాల్లో వహించిన పాత్ర ప్రధానంగా ఉంటుందని అంటున్నారు. చిరంజీవి వల్లనే కాంగ్రెసుకు వైయస్ జగన్‌కు దూరం కావాల్సి వచ్చిందనే వాదన కూడా ఉంది. దీన్ని వర్మ తన సినిమాలో ప్రధానం చేసుకుంటారా అనేది చూడాలి. చిరంజీవి చేసిన రాజకీయాలే సినిమాకు ప్రధానమని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications