వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'సింహా' అదుర్స్: బాలకృష్ణ టూర్ హిట్టా? ప్లాపా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balakrishna
తెలుగుదేశం పార్టీ నేత, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ పర్యటన విశాఖ జిల్లాలో అదుర్స్ అనిపించిందని పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో ఆయన శనివారం పర్యటించారు. తన పర్యటనలో తన సినిమాల్లోని డైలాగులతో కార్యకర్తల్లు, అభిమానుల్లో ఉత్సాహం నింపారు. సింహా సినిమాలో పాపులర్ అయిన ఒక వైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు అనే డైలాగుతో ఆయన అదరహో అనిపించారు.

తనను ఇప్పటి వరకు ఒకవైపే చూశారని.. రెండో వైపు చూపిస్తానన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారని, ఉద్యోగాలు ఇచ్చారని, దీంతో బతుకు బతికించు అనే విధంగా టిడిపి పాలన సాగిందన్నారు. అదే కాంగ్రెసు హయాంలో దోచుకో దాచుకో,, ఆంధ్రప్రదేశ్ అంధ ప్రదేశ్‌గా, అధిక ధరల ప్రదేశ్‌గా మారిందని కాంగ్రెసు పార్టీ పైన విమర్శలు గుప్పించారు. అధికార పార్టీని ఆయన ఏకీపారేశారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే మంచి రోజులు వస్తాయన్నారు. రాష్ట్రం బాగుపడుతుందన్నారు. బాలయ్య పర్యటన విశాఖ టిడిపిలో కొత్త ఉత్సాహం నింపిందట. మరో పది రోజుల్లో బాబు పాదయాత్ర విశాఖ జిల్లాకు చేరుకుంటుంది. ఇలాంటి సమయంలో బాలయ్య పర్యటన బాబు పర్యటనకు పనికి వస్తుందని పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

డైలాగులతో అదరగొట్టిన బాలయ్య వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే టిడిపికి బాగా ఉపకరిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. బాలకృష్ణ విశాఖ పర్యటన సూపర్ హిట్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య పర్యటనలో అభిమానుల మధ్య తోపులాట సాగింది. దీనిపై బాలయ్య అసంతృప్తి వ్యక్తం చేసినా తర్వాత వారితో కలిసి ఫోటో దిగారు. మరోవైపు బాలకృష్ణ విశాఖ పర్యటన ప్లాప్ అయిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి రాసింది.

బాలయ్య పర్యటన వెలవెల బోయిందని, బాలయ్య పర్యటనను విజయవంతం చేయడంలో తమ్ముళ్లు విఫలమయ్యారని, మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు పార్టీలో లేని లోటు స్పష్టంగా కనిపించిందని, బాలయ్య పర్యటించిన గ్రామాల్లో మూడు వందలకు మంచి అభిమానులు, కార్యకర్తలు రాలేదని పేర్కొంది. అలాగే బాలయ్య ప్రసంగాలు కూడా ఆకట్టుకోలేక పోయాయని పేర్కొంది.

English summary
Nandamuri hero and Telugudesam party leader Balakrishna said that he will contest from any seat of assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X