నన్ను పిలిచినా వెళ్లలేదన్న చిరంజీవి (పిక్చర్)
నెల్లూరు: సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ చెక్కు చెదరలేదని, ప్రజలు, కార్యకర్తల అండతో పార్టీ మరింత బలోపేతమవుతుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, ఎపి కాంగ్రెసు ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి మంగళవారం అన్నారు.
నెల్లూరు నగరంలోని విఆర్ కళాశాల మైదానంలో మంళవారం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. దేశ సమగ్రతకు, పేదల అభివృద్ధికి పాటుపడేది కాంగ్రెస్సే అన్నారు.ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చిన ఘనత కాంగ్రెస్‌దేనని అన్నారు.
రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్‌ది కాదని, అన్ని పార్టీలు ఒత్తిడి పెంచడంతోనే విభజించారని చెప్పారు. రాష్ట్ర విభజన సీమాంధ్రా ప్రజల అదృష్టమన్నారు. ప్రతి జిల్లా ఒక భాగ్యనగరంగా మారుతుందని అన్నారు. కాగా, బుధవారం హైదరాబాదులో ఓటేసిన చిరు.. తెలంగాణ రావడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు.

చిరంజీవి
కాంగ్రెస్‌లో పదవులు అనుభవించి పెద్ద ఎత్తున ధనం సంపాదించుకున్న కొంతమంది నేతలు తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్లు కాంగ్రెస్‌ను వీడి వెళ్లిపోయారని చిరు దుయ్యబట్టారు. వారు వెళ్లి పోవడం కూడా ఒక రకంగా పార్టీకి మంచిదే అన్నారు.

చిరంజీవి
తనను కూడా పార్టీని వీడి బయటకు రమ్మని కొంతమంది పిలిచారని, అయితే వ్యక్తిత్వం ఉన్న తాను నమ్మిన పార్టీని వీడనని చెప్పానన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో పేదల బతుకుల్లో వెలుగులు నింపుతోందన్నారు.

చిరంజీవి
మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఐదేళ్లలో రూ.వేల కోట్ల నిధులను జిల్లాకు మంజూరు చేసి రాష్ట్రంలో నెల్లూరును అగ్రగామిగా నిలిపామన్నారు.

చిరంజీవి
విద్యార్థులకు కంప్యూటర్లు, మహిళా సాధికారత కోసం డ్వాక్రా రుణాల మాఫీ, ఉద్యోగులకు ఐదు రోజుల పని దినాలు, 58 ఏళ్ల పదవీ విరమణను 60 ఏళ్లకు పెంపు వంటి కార్యక్రమాలను చేపడుతామన్నారు.

చిరంజీవి
ప్రజలంతా కాంగ్రెస్‌కు అండగా నిలిచి గెలిపించాలని కోరారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక్క సంతకం లేకుండానే రూ.లక్ష కోట్లు సంపాదించిన జగన్ ఐదు సంతకాలతో రూ.5 లక్షల కోట్లు దోచుకుంటాడని చెప్పారు.

చిరంజీవి
మాజీ మంత్రి సి రామచంద్రయ్య మాట్లాడుతూ పేదలకు, ధనికులకు, నీతికి, నిజాయతీకి మధ్య ఈ ఎన్నికల పోరాటం జరుగుతోందని అన్నారు.

చిరంజీవి
రూరల్ మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో మతతత్వ శక్తులు విజృంభించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. మోడీతో చంద్రబాబు బహిరంగంగా, జగన్ రహస్యంగా ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications