జగన్‌కు కిరణ్ 'బ్యాట్' గండం: జనవరిలో కొత్త పార్టీ?

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నారా? ఇప్పటికే ఈసి వద్ద పేరు నమోదయిందా? అంటే అవుననే అంటున్నారు. జై సమైక్యాంధ్ర పేరుతో ఇప్పటికే ఈసి వద్ద పేరు నమోదయిందని, దీనిని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ దగ్గరుండి చూస్తున్నారని అంటున్నారు. జై సమైక్యాంధ్ర పార్టీకి బ్యాట్ గుర్తును ఎంచుకున్నట్లుగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి తెలంగాణ విషయంలో తరుచూ క్రికెట్ పరిభాషలో మాట్లాడుతున్నారు.

ఈ నేపథ్యంలో జై సమైక్యాంధ్ర పార్టీకి బ్యాట్ గుర్తు అంశం.. దీని వెనుక కిరణ్ ఉండవచ్చుననే అనుమానాలకు తావిస్తోందంటున్నారు. అన్నీ చూస్తుంటే ఆఖరి బంతి పడేదాకా ఆట ముగిసినట్లు కాదని, చివరి బంతికి ఇంకా చాలా సమయముందని చెబుతున్న ముఖ్యమంత్రి సొంత బ్యాటింగ్‌కు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోందంటున్నారు. విభజన బిల్లుపై అసెంబ్లీ తన అభిప్రాయాలు చెప్పేందుకు రాష్ట్రపతి ఇచ్చిన గడువు జనవరి 23వ తేదీ. శాసన సభలో ఈ విషయం కొలిక్కి వచ్చిన వెంటనే కిరణ్ కూడా సొంత పార్టీని ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.

 Recognition to new party raises doubts

కిరణ్ 'జై సమైక్యాంధ్ర' పేరిట పార్టీ పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. తనకు ఇష్టమైన క్రికెట్ బ్యాట్‌నే గుర్తుగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కొత్త పార్టీ ఏర్పాటు, దాని నిర్వహణకు అవసరమైన నిధులను కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. పార్టీ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భవనాల ఎంపికపైనా కసరత్తు చేస్తున్నారట. సీమాంధ్ర, తెలంగాణలో కలిపి దాదాపు 200 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలపాలని ముఖ్యమంత్రి కిరణ్ నిర్ణయించుకున్నారట.

ఇప్పటికే కిరణ్ ఇమేజ్ గ్రాఫుపై ఆయన సన్నిహితుడొకరు మూడు సర్వేలు చేయించారట. సమైక్య చాంపియన్‌గా కిరణ్ గ్రాఫ్ రోజు రోజుకూ పెరుగుతోందని ఈ సర్వేల్లో తేలిందట. కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ అధిష్ఠానానికీ ఇప్పటికే కిరణ్ పార్టీకి సంబంధించిన సమాచారం అందిందని, అయినప్పటికీ, ఆయనపై చర్యలు తీసుకోకపోవడానికి కారణమూ ఉందంటున్నారు. కిరణ్‌పై ఏ చర్య తీసుకున్నా ఆయన హవా ఇంకా పెరుగుతుందని, ఆయన హీరోగా మారతారని తెలిసినందువల్లే అధిష్ఠానం ఇప్పటి వరకూ ఆయనపై చర్యలు తీసుకోకుండా మిన్నకుండిందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+