వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'తుని ఘటనలో జగన్ హస్తం': ఎప్పుడేం జరిగింది (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో ఆదివారం చేపట్టిన 'కాపు గర్జన' సభ ఆదివారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో జరిగిన కాపు గర్జన ఉద్రిక్తతకు దారి తీయడంపై టిడిపి నేతలు ప్రతిపక్షాల పైన మండిపడుతున్నారు.

ముఖ్యంగా జగన్ పైన టిడిపి నేతలు మండిపడుతున్నారు. గోదావరి జిల్లాల ప్రజలు ఇంత దారుణానికి ఒడిగట్టరని చంద్రబాబు అన్నారు. తుని ఘటనలో వైసిపి అధినేత జగన్ హస్తం ఉందని మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర ఆరోపణలు చేశారు.

మరోవైపు, ఈ ఘటనకు అధికార పార్టీయే కారణమని కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కాపులను బీసీల్లో చేర్చేందుకు రోడ్డెక్కుదామని ముద్రగడ ఇచ్చిన పిలుపు మేరకు.. రైల్వే ట్రాక్‌ మీదకు వెళ్లిన ఆందోళనకారులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే.

విశాఖ నుంచి విజయవాడ వెళుతున్న రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకున్నారు. రైలు ఆగడం కాస్త ఆలస్యం కావడంతో ఆవేశంతో ట్రాక్‌ మీదే ఉన్న రాళ్లతో దాడికి దిగారు. కాస్తంత దూరం వెళ్లి ఆగిన రైలుపై పడి ఒక్కసారిగా విధ్వాసానికి పాల్పడ్డారు. డ్రైవర్‌ను కొట్టారు.

ప్రయాణికులు ప్రాణభయంతో పిల్లా పాపలను తీసుకొని పరుగులు తీశారు. ఉద్యమ కారులు రైల్లోని సీట్లను, ఇతర పరికరాలను బయటకు లాగేసి నిప్పంటించారు. ఇంజిన్‌ తర్వాత రెండో బోగీ నుంచి దట్టమైన పొగలు వ్యాపించి మంటలు చెలరేగాయి. ఈ మంటలు అన్ని బోగీలకు వ్యాపించాయి. ఈ సమయంలో డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించి విద్యుత్‌ సరఫరా నిలిపివేయించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

 'కాపు గర్జన' ఉద్రిక్తం

'కాపు గర్జన' ఉద్రిక్తం

ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి 'కాపు గర్జన' కోసం కాపులు తరలి రావడం ప్రారంభమైంది.

 'కాపు గర్జన' ఉద్రిక్తం

'కాపు గర్జన' ఉద్రిక్తం

ఉదయం పది గంటలకు అనుచరులతో ముద్రగడ పద్మనాభం సభా ప్రాంగణానికి వచ్చారు.

'కాపు గర్జన' ఉద్రిక్తం

'కాపు గర్జన' ఉద్రిక్తం

ఉదయం పదకొండు గంటలకు వాహనాలు, లారీ, కార్లు, మోటారు బైక్‌లపై పలు ప్రాంతాల నుంచి ప్రదర్శనగా వచ్చారు.

'కాపు గర్జన' ఉద్రిక్తం

ఉదయం పదకొండు గంటలకు వాహనాలు, లారీ, కార్లు, మోటారు బైక్‌లపై పలు ప్రాంతాల నుంచి ప్రదర్శనగా వచ్చారు.

'కాపు గర్జన' ఉద్రిక్తం

'కాపు గర్జన' ఉద్రిక్తం

మద్యాహ్నం పన్నెండు గంటలకు వేదిక ప్రాంగణం వద్దకు పెద్ద ఎత్తున జనాలు వచ్చారు.

'కాపు గర్జన' ఉద్రిక్తం

'కాపు గర్జన' ఉద్రిక్తం

మద్యాహ్నం రెండు గంటలకు సభ ప్రారంభమైంది. రెండున్నర గంటల వరకు వేదికపై ఎవరు మాట్లాడడానికి అవకాశం రాలేదు. మైక్‌ కట్‌ కావడం, జనం వేదిక వద్దకు చొచ్చుకు రావడంతో అవాంతరం ఏర్పడింది.

'కాపు గర్జన' ఉద్రిక్తం

'కాపు గర్జన' ఉద్రిక్తం

దాదాపు మూడు గంటల సమయంలో ముందుగా ఒకరు మాట్లాడాక.. ఆ తర్వాత ముద్రగడ మాట్లాడారు.

 'కాపు గర్జన' ఉద్రిక్తం

'కాపు గర్జన' ఉద్రిక్తం

మూడు గంటల ప్రాంతంలో ముద్రగడ ప్రసంగాన్ని పూర్తి చేసి, వేదిక దిగిపోయి జాతీయ రహదారిపై బైఠాయించారు.

 'కాపు గర్జన' ఉద్రిక్తం

'కాపు గర్జన' ఉద్రిక్తం

మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో రత్నాచల్‌ రైలు అటుగా వచ్చింది. ఆందోళనకారులు రైలుపై దాడి చేశారు.

 'కాపు గర్జన' ఉద్రిక్తం

'కాపు గర్జన' ఉద్రిక్తం

నాలుగుంపావుకు ఆందోళనకారులు రైలు బోగీలకు నిప్పుపెట్టారు. ఒక్కసారిగా దట్టమైన పొగ రావడంతో బోగీల్లో ఉన్న ప్రయాణికులు భయాందోళనతో బయటకు దూకారు. కొంతమంది తమ లగేజీని తీసుకోగా, మరికొంత మంది లగేజీ వదిలేసి పక్కనే ఉన్న పత్తిచేలల్లోకి పరుగులు తీశారు.

 'కాపు గర్జన' ఉద్రిక్తం

'కాపు గర్జన' ఉద్రిక్తం

సాయంత్రం అయిదు గంటల ప్రాంతంలో మరిన్ని బోగీలకు నిప్పంటుకోవడంతో బోగీల్లో నిద్రపోతున్న ప్రయాణికులు ప్రాణాలను కాపాడుకోవడానికి రైల్లో నుంచి కిందకు దూకారు. చంటిబిడ్డలతో ఉన్న తల్లులు పొగ, మంటల నుంచి తమ బిడ్డలను కాపాడుకునే ఆతృతతో భయంతో పరుగులు తీశారు.

'కాపు గర్జన' ఉద్రిక్తం

'కాపు గర్జన' ఉద్రిక్తం

సాయంత్రం ఐదున్నరకు రైల్వే ట్రాక్‌పై ఉన్న ఆందోళనకారులు దీక్షా వేదిక వద్దకు చేరుకున్నారు.
ఆరు గంటల సమయంలో ముద్రగడ అనుచరులను వాహానాల మీద నుంచి కిందకు దించిన పోలీసులు వారితో మాట్లాడేందుకు బయటకు తీసుకువెళ్లారు.

'కాపు గర్జన' ఉద్రిక్తం

'కాపు గర్జన' ఉద్రిక్తం

సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో ఉద్రిక్తత పెరిగింది. నేతలను అరెస్ట్‌ చేస్తున్నారన్న అనుమానంతో ఇదే సమయంలో డిగ్రీకళాశాల ప్రాంగణంలో ఉన్న పోలీస్‌, ఇతర వాహానాలను తగలబెట్టారు. అక్కడ నుంచి కళాశాల వసతి గృహం, గ్రామీణ పోలీస్ స్టేషన్లపై దాడి చేసి అక్కడి వాహానాలకు నిప్పంటించారు.

'కాపు గర్జన' ఉద్రిక్తం

'కాపు గర్జన' ఉద్రిక్తం


రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో ఆందోళనకారులు భారీగా తుని పట్టణంలోకి వచ్చారు.

'కాపు గర్జన' ఉద్రిక్తం

'కాపు గర్జన' ఉద్రిక్తం

రాత్రి ఎనిమిది గంటల సమయంలో తుని పట్టణ పోలీస్‌స్టేషన్‌, పక్కనే ఉన్న సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయాలపై దాడి చేసి నిప్పంటించారు.

'కాపు గర్జన' ఉద్రిక్తం

'కాపు గర్జన' ఉద్రిక్తం

రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఆందోళనకారులు రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.

 'కాపు గర్జన' ఉద్రిక్తం

'కాపు గర్జన' ఉద్రిక్తం

రాత్రి పది గంటల సమయంలో ముద్రగడ దీక్ష విరమించారు. తర్వాత పట్టణంలో పరిస్థితి సద్దుమణిగింది. జాతీయ రహదారిపై రాత్రి పదిన్నర నుంచి గంటల నుంచి ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణలో పోలీసులు తలమునకలయ్యారు.

English summary
Tuni in flames: Kapu protesters set train bogies, police stations, vehicles ablaze in Andhra town
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X