ఇంట్లో బొద్దింకల బెడద: వీటితో బొద్దింకల భరతం పట్టండి!!

చాలామంది ఇళ్లల్లో బొద్దింకలతో తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు. బొద్దింకల బారినుండి ఆహారాన్ని కాపాడుకోవడానికి నానా కష్టాలు పడతారు. ఇంటికి ఎవరైనా వస్తే బొద్దింకలను చూస్తే ఏమనుకుంటారోనని తెగ బాధ పడుతూ ఉంటారు. ఇక ఇంట్లో నుంచి బొద్దింకలను పారద్రోలడానికి మార్కెట్లో దొరికే అనేక స్ప్రేలను తెచ్చి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ బొద్దింకలు పోక ఇబ్బంది పడేవారు కొన్ని సింపుల్ చిట్కాలను ట్రై చేస్తే ఫలితం ఉండొచ్చు.

బొద్దింకలు మనకు హాని చేయని కీటకాలుగా కనిపిస్తున్నప్పటికీ, అవి చేసే హాని అంతా ఇంతా కాదు. బొద్దింకలు ఆహారంపైన తిరిగితే అనేక వ్యాధులను వ్యాపింపచేస్తాయి. బొద్దింకలు తిరిగిన ఆహారాన్ని తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఇంట్లో బొద్దింకలు లేకుండా చేసుకోవడం చాలా ముఖ్యం.

Cockroaches problem in the house? Follow these 3 tips to get rid of cockroaches!!

మార్కెట్లో దొరికే ఖరీదైన స్ప్రే లను, ఆయిల్స్ ను ఉపయోగించినా ఇంట్లో బొద్దింకల బెడద తగ్గలేదంటే కొన్ని ఇంటి చిట్కాలను ప్రయోగిస్తే సరిపోతుంది. అవేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. సాధారణంగా క్యారం బోర్డు మీద క్యారమ్స్ ఆడేటప్పుడు దానిపై బోరిక్ యాసిడ్ పౌడర్ ను వేస్తాము. ఆ బోరిక్ యాసిడ్ పౌడర్ ను బొద్దింకలను తగ్గించటానికి ఉపయోగించవచ్చు .

చెంచా బోరిక్ యాసిడ్ పౌడర్ లో, రెండు చెంచాల కోకో పౌడర్ ని మైదా తో కలిపి బొద్దింకలు తిరిగే చోట వేస్తే, కోకో పౌడర్ వాసనకు అక్కడకు వచ్చిన బొద్దింకలు బోరిక్ పౌడర్ ను తింటాయి. దీంతో అవి చనిపోతాయి. అంతేకాదు బేకింగ్ సోడా తో పంచదారను కలిపి ఇంట్లో బొద్దింకలు వచ్చే చోట వేస్తే చక్కెర వాసనకు బొద్దింకలు అక్కడికి వస్తాయి.

చక్కెర అనుకొని బేకింగ్ సోడా ను బొద్దింకలు తింటాయి. దీంతో బొద్దింకలు చనిపోతాయి. ఇక బిర్యానీ ఆకుతో కూడా బొద్దింకలు లేకుండా చేయొచ్చు. బిర్యానీ ఆకుల వాసన బొద్దింకలకు అస్సలు సహించదు. బిర్యానీ ఆకుల పౌడర్ ను బొద్దింకలు తిరిగే చోట వేస్తే బొద్దింకలు లేకుండా పోతాయి. ఈ మూడు చిట్కాలతో బొద్దింకల బారినుండి ఇంటిని కాపాడుకోవచ్చు. మరెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+