వైయస్ జగన్ గూటికి జయప్రద?

Jayaprada
సమాజ్ వాదీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన సినీనటి, పార్లమెంటు సభ్యురాలు జయప్రద వైయస్ జగన్ గూటికి చేరే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడానికి ఉవ్విళ్లూరుతున్న ఆమె వైయస్ జగన్ పార్టీలో చేరడం ద్వారా తన కోరికను నెరవేర్చుకునే ప్రయత్నాలు చేస్తారని అంటున్నారు. ఆమె మంగళవారంనాడు ఫోన్ చేసి వైయస్ జగన్ దీక్షకు మద్దతు పలికారు. జగన్ ను ఆమె కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. అమర్ సింగ్ ఎటు వెళ్తే అటు వెళ్లడానికి తాను సిద్దమంటూ ఆమె గతంలో ప్రకటించారు. దీన్ని బట్టి, జాతీయ స్థాయిలో వైయస్ జగన్ కు అమర్ సింగ్ మద్దతు కూడా ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. రాజకీయాలను నడిపించడంలో తెర వెనక కీలకమైన పాత్ర పోషించే అమర్ సింగ్ వైయస్ జగన్ కు తెర వెనక మద్దతును, ముఖ్యంగా కార్పొరేట్ లాబీ మద్దతును సంపాదించి పెట్టవచ్చునని అంటున్నారు. జాతీయ రాజకీయాల్లో కూడా వైయస్ జగన్ కీలక పాత్ర పోషించడానికి తగిన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారని కూడా అనుకోవాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+