వైయస్ జగన్‌కు 'గాలి' వాత?

ఆ వ్యాపార సంబంధాలతో గాలి జనార్దన్ రెడ్డి వైయస్ మరణం తర్వాత కూడా వైయస్ జగన్‌కు అండదండలు అందిస్తూ వచ్చారని అంటారు. కాంగ్రెసు అధిష్టానంపై తిరుగుబాటు కోసం ఆయన జగన్‌కు చేయూత అందించారు. దానికితోడు, జగన్‌ను తమ బిజెపికి దగ్గర చేయడానికి కూడా ఆయన ప్రయత్నించినట్లు చెబుతారు. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపిని బలోపేతం చేయడానికి జగన్ అండదండలు ఆశించారు. అయితే, జగన్ బిజెపితో ఏ విధమైన సంబంధాలుండవని ప్రకటించడమే కాకుండా దాన్ని ఆచరణలో కూడా చూపారు. దీంతో జగన్‌కు గాలి జనార్దన్ రెడ్డి తోడ్పాటు అందించడం మానేశారని అంటున్నారు. అంతేకాదు, ఇప్పుడు బ్రాహ్మణి స్టీల్స్‌ను కూడా వదులుకుంటున్నట్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications