హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ దీక్షకు పోలీసు కొలికి

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ దీక్షకు హైదరాబాదు పోలీసులు కొలికి పెట్టారు. విద్యార్థుల ఫీజుల రీయంబర్స్‌మెంట్ సమస్యపై ఈ నెల 18 నుంచి వారం రోజుల పాటు వైయస్ జగన్ హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద దీక్షను తలపెట్టారు. తొలుత ఒక రోజు మాత్రమే జగన్ దీక్ష చేయాలని అనుకున్నారు. అయితే, మనసు మార్చుకుని వారం రోజలు పాటు దీక్ష చేస్తానని ప్రకటించారు. అయితే, పోలీసులు వారం రోజుల దీక్షకు కొలికి పెడుతున్నారు. వైయస్ జగన్ దీక్షకు ఒక్క రోజు మాత్రమే అనుమతి ఉందని చెబుతున్నారు. దీంతో వైయస్ జగన్ వర్గానికి, పోలీసులకు మధ్య వాతావరణం వేడెక్కే పరిస్థితి ఏర్పడింది. ఒక్క రోజు మాత్రమే జగన్ దీక్ష చేయడానికి అనుమతి ఉందని డిసిపి అకున్ సబర్వాల్ ప్రకటించారు. వారం రోజుల దీక్షకు జగన్ వర్గం పోలీసు అనుమతులకు ప్రయత్నిస్తుందా, కావాలని వాతావరణాన్ని వేడెక్కించేందుకు ఈ నెల 18వ తేదీని వాడుకుంటుందా అనేది చూడాల్సిందే. ఏదో మేరకు సంచలనం సృష్టించడం జగన్ ఉద్దేశమనేది అందరికీ తెలిసిందే. ఈ దిశగానే ఆయన వర్గం ఆలోచన సాగుతుందని అంటున్నారు.

English summary
Police may not allow YS Jagan to take up 7 days fast. police said that, jagan is allowed to take up deeksha for only oneday. It may create havoc on February 18.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X