నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఓడిపోయి ఉంటే వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మూతపడేదే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాన్నే కాంగ్రెసు నాయకుడు తులసిరెడ్డి - జగన్ దుకాణం మూతపడేదని అన్నారు. కోవూరులో తమ పార్టీ అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి విజయం వైయస్ జగన్ రాజకీయాలకు నైతిక బలాన్ని చేకూర్చినట్లే. ఇక్కడ గనుక ప్రసన్న కుమార్ రెడ్డి ఓడిపోయి ఉంటే జగన్ రాజకీయాలు ముందుకు సాగి ఉండేవి కావనే అభిప్రాయం బలంగానే ఉంది.
మరో 18 స్థానాలకు ఉప ఎన్నికలు రానున్న నేపథ్యంలో కోవూరు ఫలితం జగన్‌కు ఉత్ప్రేరకంగా పని చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అందుకే ఆయన కోవూరులో చివరి రోజు కూడా ప్రచారం నిర్వహించారు. కోవూరులో విస్తృతంగా పర్యటించారు. ఈ విజయాన్ని ఆయన కేక్ కట్ చేసి ఆస్వాదించారు.